ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర రూపు రేఖల్ని మారుస్తామని చెబుతూ వస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఏపీ రాష్ట్రాన్ని సింగపూర్ సిటీగా మారుస్తానని శపథం చేశాడు. అంతే కాదు ఆ దశలో అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యం మంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబుకు అందించారు. ఎపి రాజధాని లో వివిధ అవసరాల కోసం కేటాయించవలసిన భూమి తదితర వివరాలతో సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసింది.


సింగపూర్ టూర్ లో భాగంగా చంద్రబాబు, మంత్రి బృందం


అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఐదువేల ఎకరాల భూమి రిజర్వు చేయాలని ఆ మాస్టర్ ప్లాన్ లో సూచించారు. టూరిజం అభివృద్దికి పెద్ద పీట వేయాలని సింగపూర్ అభిప్రాయపడింది, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందచేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, సింగపూర్ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ సాగే ఈ సమావేశంలో రాజధాని మాస్టర్ ప్లాన్ లో పొందుపరచిన అంశాలపై చర్చించనున్నారు. అంతేకాక రాజధాని కోసం భూములు కేటాయించిన రైతులకు సమీప గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: