ఎట్టకేలకు కేజ్రీవాల్ పంతం నెగ్గింది. గతకొంత కాలంగా కేజ్రీవాల్, లెప్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే..ఢిల్లీ హైకోర్టులో సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు, శాంతి భద్రతలు, పోలీస్, భూములు తదితర విషయాలు ఆయన పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది.


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 


లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టానుసారంగా వ్యవహరించరాదని హైకోర్టు చెప్పింది. ఏసీబీ అధికారులు ఢిల్లీ ప్రభుత్వ అదేశాలనే పాటించాలని ఆదేశించింది. ఏసీబీ ఆధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు పాటించవద్దని చెప్పింది. ప్రజలు అధికారం ఇచ్చిన పార్టీని లెఫ్టినెంట్ గవర్నర్ హితవు పలికింది. ఏసీబీ అధికారులకు పోలీసులను అరెస్టు చేసే అధికారం ఉందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి వ్యాఖ్యానించారు. దీంతో కేజ్రీవాల్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: