నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేతికి చేరింది. సింగపూర్ ప్రభుత్వం తరఫున ఆ దేశ మంత్రి ఈశ్వరన్ చంద్రబాబుకు అందజేశారు. టూరిజం, గ్రీనరీ, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వంటి రంగాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోని అన్ని రహదారులు రాజధానిని కలిపేలా సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. 

జూన్ 6న ఏపీ కేపిటల్ భూమి పూజ ఉంది. దానికి 10 రోజుల  ముందే మాస్టర్ ప్లాన్ చంద్రబాబు చేతికి చేరింది. ముందుగా అనుకున్న సమయం కన్నా ముందే సింగపూర్.. ఏపీకి మాస్టర్ ప్లాన్ ఇచ్చేసింది. 

జూన్ 15లోపు కోర్ కాపిటల్ ప్లాన్..


అమరావతి కోర్ కేపిటల్ ప్లాన్ ను జూన్ 15 లోగా ఇస్తారు. దాదాపు 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటుకానుంది. ముఖ్యమైన అసెంబ్లీ, శాసనమండలి శాసనమండలి, 
రాజభవన్, సచివాలయం, ఇతర ప్రభుత్వ ముఖ్యకార్యాలయాలకు సంబంధించిన ప్లాన్ ఇందులో ఉంటుంది. 

ఈ కేపిటల్ ప్లాన్ విశేషాలు ఒకసారి పరిశీలిద్దాం.. 


* కృష్ణా నదీపరివాహానికి ఇరువైపుల మొత్తం 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉంటుంది. 
*ఏడు కారిడార్లగా రాజధాని రూపకల్పన
*5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం 
*కృష్ణా నదిలో ప్రత్యేక ఆటలు, జలరవాణా
*తాగు నీరు, విద్యుత్తు, రవాణా, మౌలికసదుపాయల ప్రాధాన్యం


*ఐటీ, ఐటీ ఏనేబుల్డ్ , పారిశ్రామిక, వాణిజ్య.. ఇలా అన్ని రంగాలకు ప్రత్యేక జోన్లు 
*మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, అమరావతి, తెనాలి వంటి పట్టణాలకు కలుపుతూ రాజధాని
*రాజధానిలోకి ప్రవేశించాక ఏ రహదారి నుంచైనా సరే జాతీయ రాహదారికి సులభంగా వెళ్లేలా ప్రణాళిక

*అమరావతిని తాకుతూ 5 వ నెంబర్, 9వ నెంబర్‌ 221వ నెంబర్‌ జాతీయ రహదారులు 
*కృష్ణా, గుంటూరు జిల్లాలలను కలుపుతూ కృష్ణానదిపై మరో 4 వంతెనలు 
*ప్రజారవాణాకు పెద్దపీట, 124 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌,సెమీ ఎక్స్‌ప్రెస్‌ రహదారులు 



*మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, కృష్ణపట్నం పోర్టుల నుంచి రవాణా
*అమరావతి, కొండపల్లి కోట, కనకదుర్గ ఆలయం, మంగళగిరి ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలు కలుపుతూ కారిడార్


మరింత సమాచారం తెలుసుకోండి: