ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ దాదాపుగా సిద్ధమైపోయింది. 219 చ.కి.మీ పరిధిలోని రాజధానికి సంబంధించిన మేజర్ ప్లాన్ ను ఇప్పటికే సింగపూర్ ఏపీకి అందించింది. మరో కీలకమైన ప్లాన్ ను వచ్చే15 నాటికి అందిస్తామని చెప్పింది. ఇప్పటికే ఈ ప్లాన్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేవలం ప్లాన్ ఇవ్వడమే కాదు.. రాజధాని నిర్మాణంలోనూ పాలుపంచుకునేందుకు తమ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సింగపూర్ మంత్రి ప్రకటించారు. 

సింగపూర్ మాస్టర్ ప్లాన్ వెనుక కుట్ర.. ?


ఐతే.. సింగపూర్ ఇచ్చిన ప్లాన్ పై ప్రధాన ప్రతిపక్షం పెదవి విరుస్తోంది. రాష్ట్ర రాజధాని మాస్టర్ప్లాన్ను సింగపూర్ మంత్రి విడుదల చేయడం ఏమిటని ఆ పార్టీ అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించుకోలేని దీనస్థితిలో తెలుగు ప్రజలున్నారా అని నిలదీశారు. అంతే కాదు.. మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ఇవ్వడం వెనుక.. ఏపీ ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉందని.. దాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 

అంత గొప్పగా ఏం లేదు.. 


వైసీపీకి చెందిన మరో నేత మైసూరారెడ్డి కూడా ఏపీ రాజధాని ప్రణాళికను తప్పుబట్టారు. సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ ప్లాన్ గీడయానికి డబ్బులు, టెక్నాలజీ, ప్రభుత్వం అవసరం లేదని ఆయన అబిప్రాయపడ్డారు. రాజధాని ప్రభుత్వం చేతుల్లో ఉండాలని, ప్రైవేటు చేతుల్లో పెట్టకూడదని మైసూరా అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టకుండా.. మాస్టర్ ప్లాన్ల పేరుతో హాడావిడి తగదని ఆయన ఏపీ సర్కారుకు సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: