ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై తమ పార్టీ మాట ఇచ్చిందని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ముచ్చటే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అయితే ఈ విషయంపై కొందరు నాయకులు, విపక్ష నేతలు పని కట్టుకొని మరి బీజేపీని తప్పు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ యేడాది పాలనపై ఆయన స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందని అన్నారు.


అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న ఏపీ సీఎం చంద్రబాబు


అంతే కాదు ప్రత్యేక హోదాపై ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించామని ఏపీ అభివృద్ది కోసం కొంత నిధులు కూడా కేటాయించాలని ఆయన కోరినట్లు అమిత్ షా తెలిపారు. ఎన్టీఏ పరిపాలన దేశ అభివృద్ది దిశగా సాగుతుందని తమ ప్రభుత్వ హయాంలో ఏపీకి భద్రతకు అభివృద్దికి భరోసా కల్పిస్తామని కావాలని విపక్షాలు  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయిన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: