కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సంవ‌త్స‌ర కాలంలో మోడీ 18 దేశాలు పర్యటించారు. త ద్వారా ప్రపంచంలో భారతదేశానికి ఓ గౌరవం, ప్రాధాన్యతను తీసుకువచ్చారన‌మాట వాస్త‌వం. అంతేకాకుండా ప్రపంచ చిత్రపటంపై భారత్‌ ఖ్యాతి మరింత ఇనుమడింప‌జేశాడు. అయితే అతిగా విదేశీయానాలే తప్ప స్వదేశీ సంస్కరణలపై దృష్టి సారించలేదని పెదవి విరిచినవారూ లేకపోలేదు. అయితే దేశంలోని వివిధ సంస్థలు ఇచ్చిన సర్వే మేరకు...మోడీకి 60 శాతం పైగా మార్కులు తెచ్చుకున్నారు. స్వచ్ఛభారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియాలాంటి పథకాలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.  

మోడీ సాధించిన విజయాల్లో


యూపీఏ పదేళ్ల పాటు చేసిన తప్పులను సరిదిద్దేందుకు సమయం తీసుకుంటుందని బీజేపీ వర్గాలు అంచ‌నా. ఆ మాటకు వస్తే అది నిజమేనని మోడీ అభిమానులు కూడా వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రతిష్టను మరింత పెంచే దిశ‌గా మోడీ ప్రయత్నం చేస్తున్నారనది వాస్త‌వ‌మే.  మోడీ సాధించిన విజయాల్లో.. అవినీతి, ధరలు తగ్గు ముఖం పట్టడం, స్వచ్ఛ భారత్‌, మైనార్టీలకు భద్రత పెరగడం, మత ఘర్షణలు తగ్గటం, జన్‌ ధన్‌ యోజన వంటివి అని చెప్పవచ్చు. రైతులకు ఏం చేయలేకపోవడం, అంచనాలు అందుకోకపోవడం వైఫల్యాలుగా చెప్పుకొవ‌చ్చు. అయితే, ఏడాదికో కోటి ఆశలు తీరాలనుకోవడం కూడా సరికాదు. మేకిన్‌ ఇండియా, స్మార్‌‌ట సిటీలు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. వివాదాలు... కేంద్రం తెచ్చిన భూసేకరణ బిల్లు పైన విపక్షాలు ఆగ్రహం చెందాయి. పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకే మోడీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే, తాము తెచ్చిన ఈ బిల్లు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ చెబుతోంది.

కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ


దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించి 22 ఏళ్లుగా అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేసీఏ)ను ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్ ను ఏర్పాటు చేశారు. కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కేంద్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. కాగా, ప్రధాని అయ్యాక మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుంచుకోవాలని కొందరు అంటున్నారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలన వల్ల భ్రష్టు పట్టిందని ఆయన అప్పుడు అభిప్రాయపడ్డారు. దీనిని బయటపడేసే క్రమంలో తొలి ఏడాది తనను ప్రజలు తిట్టుకుంటారని, మూడో ఏడాదికి ఫలితం వస్తుందని మోడీ వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో


ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్‌డిఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా మోడీ పాలనపై ప్రశంసలతో పాటు పెదవి విరుపులు ఉన్నాయి. అయితే ప్రతిపక్షాల అనైక్యతే ఆయనకు బలంగా మారాయి. ప్రధాన ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోని కాంగ్రెస్‌ ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే పార్టీ పగ్గాలు చేపడతారని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకూ ఇలాంటి ప్రకటనలు ఎన్నో వెలువడినా ఆయన తన మనోగతాన్ని వెల్లడిచేయకపోవడంతో ఈ సారి కూడా అలా అవుతుందే మోనన్న అనుమానాలు జనంలో ఉన్నాయి. 

బీహార్‌ అసెంబ్లి ఎన్నికల్లో


మరో వంక జనతాదళ్‌ పరివార్‌ పేరిట ఆ పార్టీ చీలిక, పీలిక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, బీహార్‌ అసెంబ్లి ఎన్నికల్లో జనతాదళ్‌(యు), రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి)లు ఆధిపత్యం కోసం అప్పుడే కుమ్ములాటలు బయలుదేరినట్టు వచ్చిన వార్తల నేపధ్యంలో ఎన్నికల ప్రకటన వెలువడేవరకైనా అది సంఘటితంగా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వామపక్షాలు గతంలో మాదిరిగా ప్రజాసమస్యలపై ఉద్యమాలను నిర్వహించకపోవడం వల్ల అవి తిరిగి ప్రజాభిమానాన్ని పొందుతాయా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.ఈ నేపధ్యంలో మోడీ ప్రభుత్వం ఏడాదిపాలనలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో పెద్దగా కృషి చేయకపోయినా ఆయన వైపే యావత్‌ దేశమే కాకుండా,ప్రపంచం చూస్తోంది.

ప్రధాని మోడీ ఇలాంటి ముట్టడి కార్యక్రమాలను ప్రోత్సహించరు


పార్టీపరంగా బిజెపి కొన్ని తప్పటడుగులు వేస్తున్నట్లు వస్తున్న విమర్శల్లో వాస్తవం కూడా లేకపోలేదు. అధికారంలో లేని రాష్ట్రాల‌లో పార్టీ పరపతిని పెంచుకోవడం కోసం గత 11 నెలలుగా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సాధించాల్సిన విజయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. అంతేతప్ప తమ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర శాసన… సభను ముట్టడి చేసే ప్రయత్నం బిజెపి శ్రేణులకు, యూనిట్లకు తగదు. అలాంటి కార్యక్రమాలను పార్టీ అధినేత ప్రోత్సహించినా... ప్రపంచ దేశాల పర్యటనల్లో గాంధీజీ శాంతిమంత్రాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీ ఇలాంటి ముట్టడి కార్యక్రమాలను ప్రోత్సహించరు. అలాచేస్తే వారిని నిలువరించాలి.


గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌తో సహా బిజెపి యేతర పార్టీలన్నీ చిందరవందరయ్యాయన్నది వాస్తవం. ఓటర్లు వేసిన వేటుకు ఆ పార్టీలన్నీ కోలుకోవడానికి, తేరుకోవడానికి 10 నెలలు పట్టింది. అయినా విపక్షాలు తమ అనైక్యతను కొనసాగిస్తున్నాయి. అయితే ఇది బిజెపికి ఊరట కల్గించే అంశమే అయినా ఎన్‌డిఎ ప్రభుత్వానికి తన ఎన్నికల మ్యానిఫెస్టోను అమలుచేస్తూ వాగ్దానాలన్నింటినీ పూర్తిచేసి ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పి పరపతిని విస్తృత పరచుకోవడమే ఏకైక ఎజెండా అవ్వాలి. ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రంలోని ఆంతర్యం ఇదే కదా! విజ్ఞులైన ఓటర్లు పసలేని విమర్శలు చేసే నేతలు, పార్టీలపై ఎలా కన్నేసి ఉంచుతారో అదే సమయంలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీల పనితీరును కూడా నిశితంగా గమనిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: