విజయవాడ, గుంటూరుల మధ్య ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త రాజధానికి అమరావతి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి చారిత్రక నేపథ్యం. బౌద్ధ నేపథ్యం కారణంగా.. ఆ పేరు అన్నివిధాలా బావుంటుందని చాలామంది మెచ్చుకున్నారు. ఈ పేరుపై అభ్యంతరాలు మాత్రం ఎక్కడా రాలేదు. 

అక్షరం తీసేస్తే భవిష్యత్తు బంగారమే.. 

ఐతే.. అమరావతిని ఆంగ్లంలో రాసేపటప్పుడు AMARAVATHI అని రాయాల్సి ఉంటుంది. అలా రాసినప్పుడు మొత్తం 10 అక్షరాలు వస్తున్నాయి. సంఖ్యాశాస్త్రపరంగా 10 అక్షరాలు ఉండటం దోషమవుతుందట. అంతేకాకుండా 9 అక్షరాలు ఉంటే దాని భవిష్యత్తు దివ్యంగా ఉంటుందట. 

రాజధాని నామదోషం పోయేలా.. ఆంగ్లం స్పెల్లింగ్ లో  H అనే అక్షరాన్ని తొలగించి AMARAVATI అని రాస్తే.. ఏపీ కేపిటల్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందట. ఏపీ ప్రభుత్వం కూడా ఈ సూచనలకు అంగీకరించింది. అందుకే.. ఇకపై వస్తున్న ప్రభుత్వ అధికార పత్రాలల్లో అమరావతి పేరులను ఆంగ్లంలో AMARAVATI గానే రాస్తారు. భవిష్యత్ బావుండాలని చాలా మంది తారలు, రాజకీయనాయకులు తమ పేర్లలో మార్పులు చేసుకున్నట్టే ఏపీ కేపిటల్ కూడా చిన్నమార్పు చేసుకుందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: