టీడీపీకి మహానాడు కళ వచ్చేసింది. ఆ పార్టీ పండుగగా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఈసారి కీలక మార్పులు జరగనున్నాయి. అందులో ముఖ్యమైంది పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబుకు ప్రమోషన్ విషయం. ఆయన్ను ఇకపై పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. 

ఇక కేంద్ర కమిటీ అధ్యక్షుడు.. 


తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చాలన్ని ప్రయత్నిస్తున్న అధినేత..ఇకపై కొత్త బాధ్యత స్వీకరిస్తారు. చంద్రబాబును కేంద్ర కమిటీ అధ్యక్షుడుగా ఎన్నుకున్న తర్వాత.. కొద్దికాలానికి పార్టీ రెండు రాష్ట్రశాఖలకు కొత్త అధ్యక్షులను ఎన్నుకుంటారు.  అయితే ఈ మార్పుల్లో భాగంగా లోకేశ్ కు ఏదైనా కీలక పదవి కట్టబెడతారా లేదా అన్న విషయం మాత్రం అంతుబట్టడం లేదు. 

భవిష్యత్ అయోమయం


ఇప్పటికే పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న లోకేశ్ కు ఏదైనా కీలకపదవి ఇస్తే.. స్థాయి, హోదా పెరుగుతాయన్న భావన పార్టీ నేతల్లో ఉంది. అయితే.. ఈ అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే లోకేశ్ జోక్యం ఎక్కువవుతోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు కీలక పదవి అప్పగిస్తే.. ఆ విమర్శలకు తావు ఉండదని కొందరు సూచిస్తున్నారు. మరి బాబు ఏంచేస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: