తెలుగుదేశం పార్టీకీ సాక్షికీ ఉన్న వైరం సంగతి తెలిసిందే. ప్రతిపక్షపార్టీ అధినేత సొంత పత్రిక అయిన సాక్షిపై టీడీపీ చాలా కాలంగా ఆగ్రహంగా ఉంది. తమ పార్టీ సమావేశాలకు కూడా సాక్షిని పిలవడం లేదు. ఒక రకంగా ఆ పార్టీ సాక్షి పత్రికను బహిష్కరించింది. 

ఇక్కడ సాక్షికి ప్రవేశం లేదు.. 


పార్టీ కార్యక్రమాలకే కాదు.. ఏపీలో అధికారంలోకి వచ్చాక కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా పిలవలేదు. దీనిపై సాక్షి పలు వేదికలపై పోరాడింది. చివరకు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించాలని.. పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టాలని టీడీపీ డిసైడయ్యింది. కొంతకాలంగా ఇదే పద్దతి అనుసరిస్తోంది. 

బాబూ.. ఇది సరికాదు.. 


ఐతే.. ఇప్పుడు టీడీపీ మహానాడు వంటి బ్రహ్మాండమైన వేడుక చేసుకుంటోంది. దీని కూడా సాక్షిని అనుమతించడం లేదు. ఈ మేరకు పార్టీ మీడియా కమిటీకి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అధికార పార్టీ అయి ఉండి.. ఇలా ఓ పార్టీ పత్రికపై కక్ష కట్టడం విమర్శలు తావిస్తోంది. ఇది అప్రజాస్వామికమని.. పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతమని సీనియర్ పాత్రికేయులు విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకుంటారా..!?  


మరింత సమాచారం తెలుసుకోండి: