తెలుగుదేశం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు సర్వం సిద్దమవుతోంది.హైదరాబాద్ లోని గండిపేటలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు. తెలుగుజాతి ఐక్యతను చాటిచెప్పేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కీలకమైన రాజకీయ తీర్మానాలను కూడా ప్రవేశపెట్టనున్నారు.తెలుగుదేశం వ్యవస్థాపకుడు, స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1982లో పార్టీని స్థాపించారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు, పార్టీ దశదిశ అవలోకనం చేసుకోవడానికి, కీలక రాజకీయ తీర్మానాలకు, పార్టీని బలోపేతం చేయడానికి 1983లో మహానాడు వేడుకలను ప్రారంభించారు.


తెలుగు దేశం మహానాడు వద్ద పోస్టర్లు


హైదరాబాద్ గండిపేటలో 34వ మహానాడుకు సర్వసిద్ధం చేస్తున్నారు...తెలుగు తమ్ముళ్లు. 27,28,29 మూడు రోజుల పాటు మహానాడు జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడంతో... తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల మధ్య ఆత్మీయత చెక్కుచెదరలేదని నిరూపించే విధంగా ఉభయ రాష్ట్రాల సంస్కృతులు ఉట్టిపడేలా వేదికను రెడీ చేస్తున్నారు.గండిపేటలో మహానాడు నిర్వహించనున్న ‘తెలుగు విజయం’లో ఏర్పాట్లను పూర్తి చేశారు. మహానాడులో రెండురాష్ట్రాల అంశాలతో పాటు జాతీయ సమస్యల మీద తీర్మానాలపై చర్చ జరిపి ఆమోదించనున్నారు. టి- సర్కారు వైఫల్యాలపైనా చర్చించనున్నారు.


టీడీపీ కార్యకర్తలతో నారా లోకేష్ బాబు


లోకేశ్‌కు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.ఈ వేడుకకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి కార్యకర్తలు రానున్నారు.తెలంగాణకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించాలన్న ఆలోచన ఉన్నా ఆ అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెడుతూ ఒక తీర్మానం చేయడంతో సరిపుచ్చుతారన్న మాట వినిపిస్తోంది.  పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను మార్చే అంశంపై కమిటీ కసరత్తు చేస్తోందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పారు. కాగా,  మహానాడు ప్రాంగణాన్ని టీడీపీ కార్యకర్తల సహాయనిధి కన్వీనర్ నారా లోకేశ్ మంగళవారం పరిశీలించారు

మరింత సమాచారం తెలుసుకోండి: