నిజమే ఈ మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఆర్ హెచ్‌ఆర్‌డీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, కంటోన్మెంట్ సభ్యులతో సీఎం కేసీఆర్ సమావేశంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 390 కి.మీ.పొడవైన 72 నాలాల పరిస్థితి బాగాలేదు. వర్షపు నీరు పోవాల్సిన నాలాల్లో మురికి నీరు ప్రవహిస్తుంది. నాలాలపైనా, నాలాల నీళ్లలో కూడా కట్టడాలు వచ్చాయి. వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. శానిటేషన్ పరిస్థితి బాగా లేదు. ప్రతిరోజూ నాలుగువేల మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతోంది.


కేసీఆర్ మీటింగ్


ప్రపంచంలో హైదరాబాద్ ను ఒక గొప్ప మహానగరంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రజా పక్షాన గెలిచిన మనం అందుకు నడుం బిగించాలని అన్నారు. చెత్తను బయటకు పంపే ఏర్పాట్లు బాగా లేవు. చెత్త తొలగింపు విషయంలో అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి. చెత్త ఏరివేయడంతో పాటు శిథిలాల తొలగింపు కూడా ముఖ్యమే. చాలా బస్తీల మీదుగా హైటెన్షన్ వైర్లు పొతున్నాయి. దీనివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో లోవోల్టేజ్ సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా నాలాలు, హైటెన్షన్ వైర్ల దుస్థితి, చెత్త తరలింపు, శిథిలాల తొలగింపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధుల నుంచి కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు.


స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్


 ఈ సందర్భంగా నాలాలు, హైటెన్షన్ వైర్ల దుస్థితి, చెత్త తరలింపు, శిథిలాల తొలగింపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధుల నుంచి కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నాయిని, జూపల్లి, తలసాని, పద్మారావుగౌడ్‌తో పాటు గ్రేటర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: