తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత హైదరాబాద్ పది సంవత్సరాల వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేట్లు విభజన సమయంలో పేర్కొన్నారు. కానీ ఎప్పటికైనా ఏపీలో రాజధాని ఉండాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచి దాని నిర్మాణానికి పునాధులు వేయాలనుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.  కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నప్పటి నుంచి అనేక రకాలు గా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి ఏపీ రాజధాని కోసం భూములు తీసుకునేందుకు చంద్రబాబు రైతులను ఒప్పించే ప్రయత్నంలో ఉండగా రైతులు మాత్రం తమ భూములు ఇవ్వమని అంటున్నారు.

రాజధాని ఏర్పాటు చేయడానికి సూచించిన మ్యాప్


తాజాగా రాజధాని నిర్మాణానికి మరో చిక్కొచ్చిపండింది, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ వివాదం తాజాగా జాతీయ పర్యావరణ ట్రబ్యునల్ కు ముందుకు వచ్చింది. ఏపీ రాజధానిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో బుధవారం విచారణ జరిగింది. రాజధాని నిర్మాణానికి సాగులో ఉన్న పంటభూములు తీసుకుంటున్నారని దీనివల్ల ఆహార భద్రతకు ముప్పు కలుగుతుందని, కృష్ణా పరివాహక ప్రాంతంలో రాజధాని పర్యావరణానికి నష్టం కలుగుతుందని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయకుండా రాజధాని నిర్మించకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.


ఏపీ రాజధాని అమరావతి


సుమారు 15 నిమిషాల పాటు వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. కాగా ఈ కేసుపై న్యాయస్థానం జులై 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూలిగే నక్కపై వాద పడ్డట్టు పట్టు పట్టి చంద్రబాబు రాజధాని సింగపూర్ లెవెల్లో తీర్చిదిద్దాలనుకుంటే ప్రతిసారీ అవాంతరాలు వచ్చిపడుతూనే ఉన్నాయి.  కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గంగూలీ కోర్టుకు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: