ఎంజీఆర్.. ఎంజీ రామచంద్రన్.. తమిళనాట జనం దేవుడిగా కొలుచుకునే నటుడు.. అటు ఎంజీఆర్, ఇటు తెలుగునాట ఎన్టీఆర్ ఒకే సమయంలో పతాకస్థాయి నటన కనబరిచారు. అలాంటి ఎంజీఆర్ ఎన్టీఆర్ గురించి ఆకాశానికెత్తేశారు. దాదాపు 45 ఏళ్లక్రితం ఓ సినీపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు నెమరేసుకున్నారు. 

ఎన్టీఆర్ గురించి ఎంజీఆర్.. 


ఎన్టీఆర్ ఎలాంటి పాత్రకయినా సూట్ అయ్యేవారని.. తెరపై ఎన్టీఆర్ పోషించిన పాత్రలు తప్ప ఎన్టీఆర్ కనిపించేవారు కాదని ఎంజీఆర్ మెచ్చుకున్నారు. అందుకు ఆయన ఓ ఉదాహరణ చెప్పారు. ఓ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన ముసలివాడి పాత్ర చూసి ఎంజీఆర్ ఆశ్చర్యపోయారట. 

ఆ అభినయం..  ఆయనకే చెల్లింది.. 


ముసలిపాత్రలో.. కళ్లజోడు పెట్టుకుని ఎన్టీఆర్ నడచివస్తుంటే..అది ఎన్టీఆరే అనే విషయం ఎంజీఆర్ నమ్మలేకపోయారట. ఆయన అలాంటి ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించారని కొనియాడారు. అంతేకాదు..ఎన్టీఆర్ నటిస్తూ ఉంటే.. ఆయన శరీరంలోని ప్రతి అంగమూ నటిస్తుందని.. అలాంటి ఆంగిక, మౌఖికాభినయం ఇతర నటుల్లో చూడలేమని తన వ్యాసంలో ఎంజీఆర్ ప్రశంసించారు. 

ఎంజీఆర్.. భవిష్యత్ ముందే చెప్పేశారు.. 


అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో భయంకరమైన తుపాను వచ్చినప్పుడు ప్రజల కోసం ఎన్టీఆర్ విరాళాలు సేకరించిన సంగతిని కూడా ఎంజీఆర్ తన వ్యాసంలో రాశారు. ఆయన ఇలాగే కలకాలం కళాసేవ, ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. అలాంటి మహా నటుడి ఆశీర్వాద ఫలమో ఏమో గానీ.. ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగు రాజకీయ ముఖ చిత్రాన్నే సమూలంగా మార్చివేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: