తెలుగు చరిత్రను వక్రీకరించారు.. మా పోరాటాలు, మా వీరులు, మా సంస్కృతి, మా భాషను నిర్లక్ష్యం చేశారు.. ట్యాంకు బండ్ పై విగ్రహాల్లో తెలంగాణ వాళ్లెంత మంది..  ఇవీ ఇన్నాళ్లూ తెలంగాణవాదులు, ప్రత్యేకించి టీఆర్ఎస్ నాయకులు చెప్పిన కబుర్లు.. తెలంగాణ వచ్చేసింది. అధికారపగ్గాలూ టీఆర్ఎస్ చేతికొచ్చాయి.  

తెలంగాణ చరిత్రలో సోనియాకు స్థానం లేదా.. ?


చరిత్ర వక్రీకరణ విషయంలో ఆంధ్రానేతలను తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు అదే పని చేస్తున్నాడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ ఆవిర్భావాన్ని గురించిన పాఠాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని మండిపడుతున్నారు. ఒక్క కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చినట్టు పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. 

ఇదెక్కడి వింత చరిత్ర.. 


తెలంగాణ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చూపిన చొరవ, తెగువ అసమాన్యమైనవి. ఓ ప్రాంతంలో పార్టీ మట్టిగొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిసినా.. ఇచ్చిన మాట కోసమంటూ ఆమె తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడ్డారు. అలాంటి సోనియాగాంధీ ప్రస్తావన లేకుండానే పాఠ్యపుస్తకాలు రూపొందించడం దారుణమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని.. ఇప్పటికైనా సోనియా ప్రస్తావనతో పుస్తకాలు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: