చేసింది ఎంతైనా అది సరిగ్గా చెప్పుకోకపోతే.. జీవితంలో పైకి రాణించడం కష్టం. ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న రాజకీయ నేతల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉంటారు. ఆయన మీడియా ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. అధికారంలో ఉన్పప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోందని.. విజన్ల మీద విజన్లు సృష్టించడం ఆయనకే చెల్లింది. 

లోకేశ్ ను మోడీ కాపీ కొట్టేశారా..? 


హైదరాబాద్ ను తానే ప్రపంచ పటంలో పెట్టానని.. తనను చూసే దేశమంతా కాపీ కొడుతోందని మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తండ్రిబాటలోనే ఆయన తనయుడు లోకేశ్ కూడా సాగిపోతున్నాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా మరి. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా ఉన్న ఆయన.. ఆ మధ్య కార్యకర్తల కోసం బీమా పథకం ప్రవేశపెట్టాడు. 

ప్రచారంలో లోకేశ్ దూకుడు.. 


తాను కార్యకర్తల కోసం పెట్టిన బీమా పథకాన్నే ఇప్పుడు మోడీ కూడా కాపీ కొట్టేసి.. దేశమంతా అమలు చేస్తున్నాడని ఏకంగా మహానాడు వేదికగానే ప్రకటించేశారు చినబాబు లోకేశ్. ఏకంగా ప్రధానమంత్రే తనను చూసి కాపీ కొడుతున్నాడనే రేంజ్ కు అప్పుడే లోకేశ్ ఎదగడం టీడీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నారు. కాస్త తగ్గితే బెటరేమో అనుకుంటున్నా.. ఆ మాట చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: