నల్లగొండ జిల్లా కేంద్రంలో మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం నల్లగొండలో బీజేపీ నిర్వహించిన ‘ప్రజాసేవ పునరంకిత’ సభలో కలకలం రేగింది. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే ఓ వ్యక్తి హఠాత్తుగా ఒంటినిండా మంటలతో కేకలు వేస్తూ వేదికపైకి దూసుకొచ్చాడు.సభలో కిషన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ఆకస్మాత్తుగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని వేదికపైకి పరుగు తీశాడు.


ఆత్మహత్యకు పాల్పడ్డ శంకర్

బీజేపీ నల్లగొండ సభలో కలకలం

ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న బిజెపి కార్యకర్తలు వెంటనే శంకర్‌ను పట్టుకుని దుస్తులు తొలగించి మంటలు ఆర్పివేసి అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో రాకపోవడం, అవసరమైన మందులు లేకపోవడంతో వెంటనే స్థానికంగా ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రికి శంకర్‌ను తరలించారు . ఆత్మహత్య చేసుకున్న బరిశెట్టి శంకర్  ఈ గ్రామకంఠం భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించడంపై శంకర్ పోరాడుతున్నాడు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే ఇతనిపై కేసు నమోదు చేశారు. అంతే కాదు ఆ ఊరిలో ఓ పార్టీ వర్గం వారు తనను మానసికంగా, శారీరకంగా బాధించడంపై విసుగు చెందిన శంకర్ , కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.


బరిశెట్టి కి జరిగిన అన్యాయాన్ని  తెలుకున్న బిజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆంజనేయస్వామి దేవాలయ భూమి అక్రమ అమ్మకం వ్యవహారంలో బాధ్యులైన రెవెన్యూ, పోలీస్ అధికారులపై, టిఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీవోను పిలిచించి భూ కబ్జా విషయంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ కుటుంబానికి న్యాయం చేయాలని, అతన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ బంగ్లా ఎదుట కిషన్‌రెడ్డి ధర్నా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: