సినిమా ప్రపంచం ఓ మాయా జాలం.. సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక పేరు రావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సినిమాల్లో చాన్సుల కోసం ఎంతో కష్టపడే వారిని స్టూడియోల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే సినిమా వేషాలు ఇప్పిస్తామని కొందరు దళారులు ఉంటారు, మగవాళ్లని అయితే నిండా క్షవరం చేస్తారు.. కానీ ఆడవారు గనక వాళ్ల చేతిలో పడితే సర్వ నాశనం చేస్తారు.

సినిమా షూటింగ్ (ఫైల్)


తాజాగా అలాంటి సంఘటన ఒకటి బెంగుళూరులో చోటు చేసుకుంది, తాను ఒక ప్రొడ్యూసర్ అని చెప్పి భవిష్యత్ లో నీకు సినిమా చాన్సులు బొలెడన్ని ఇప్పిస్తానని నిన్ను స్టార్ ని చేస్తానని చెప్పి సహనటిపై కుమార్‌ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. రీసెంట్ గా రూపొందుతున్న ఓ చిత్ర షూటింగ్ సమయంలో  హీరోయిన్ కు స్నేహితురాలి పాత్ర వేసేందుకు రేష్మను మధ్యవర్తి ఉపేంద్ర సహాయంతో ఆహ్వానించిన నిందితుడు బాధితురాలిపై  అత్యాచారానికి యత్నించాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: