సుప్రసిద్ద యోగ గురువు రాందేవ్ బాబాకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు, ఏదో వివాదాస్పద విషయాలు ఆయన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన సోదరుడు రామ్ భరత్‌ను బుధవారం ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. పతంజలి ఉత్పత్తులను కొంతకాలం నుంచి తమ ద్వారా పంపిణీ చేయించట్లేదంటూ ట్రాన్స్‌పోర్టర్లు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి హెర్బల్ ఫుడ్ పార్క్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.హరిద్వార్‌లోని పతంజలి హెర్బల్‌ ఫుడ్‌ పార్క్‌లో బుధవారం ఫుడ్‌ పార్క్‌ ఉత్పత్తులు తరలించే హరిద్వార్ ట్రక్కు యూనియన్, రాందేవ్ బాబా గార్డుల మధ్య వివాదం నెలకొంది.


బాధితులు 

One killed in Haridwar Patanjali Food Park; Ramdev's brother arrested

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దీనిపై ట్రాన్స్‌ఫోర్టర్స్‌ సిబ్బందితో రాంభరత్‌ మాట్లాడుతున్న సమయంలో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇరు వర్గాలు తుపాకులతో కాల్పులకు పాల్పడటంతో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాంభరత్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి రామ్ భరత్‌‌ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగాదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ యోగా గురు రాందేవ్ బాబా సోదరుడు రామ్ భరత్‌కు హరిద్వార్‌లోని స్ధానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు, అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: