న‌ల్ల‌కుబేరుల జాబితాల పై ఇప్పుడు ఆశ‌క్తి నెల‌కోంది. ప్ర‌స్తుతానికి 7 పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టిన స్విస్ ప్ర‌భుత్వం, మిగ‌తావారి పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టడం మీదే అందరి చూపు. ఇంత‌కి ఎంత‌మంది, వారు ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సి ఉంది. భారతీయ నల్లకుబేరుల పేర్లు వెల్లడిస్తున్నస్విట్జర్‌లాండ్‌, త్వరలో మరి కొన్ని వివరాలు చెప్పేందుకు సిద్ధపడటం ఆహ్వానించదగిన పరిణామం. డబుల్‌ట్యాక్సేషన్‌ ఎవాయిడెన్స్ ఎగ్రిమెంట్‌ (డిటిఏఏ) 2000 సంవత్సరంలో కుదిరింది. ఇరు దేశాల మధ్య నల్లధనం దాచుకున్న వారి వివరాలు ఇచ్చిపుచ్చుకునే వీలుంది. పదేళ్ల యూపిఏ పాలనలో దీనికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. యుపిఏ ప్రభుత్వానికి కాలంతీరి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్వదేశంలో, విదేశంలో కూడా నల్లధనం దాచుకున్న వారిని వెలికి తీసుకువచ్చేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు


సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుకు అంగీకరించడం నుంచి స్విట్జర్‌ల్యాండ్‌ ప్రభుత్వంతో చురుకుగా చర్చలు జరపడం వరకూ ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం నడచుకుంది. ఇటీవలే స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న ఏడుగురి పేర్లను స్విస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరిలో ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యశ్‌బిర్లా, గుర్జీత్‌ సింగ్‌ కొచ్చార్‌, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రితికాశర్మలు ఉన్నారు. గతంలో ఢిల్లీకి చెందిన లతాసాహ్నీ, సంగీత సాహ్నీ పేర్లను బయటపెట్టిన విషయం విదితమే. ముంబయికి చెందిన లైమోజిన్‌ స్కామ్‌లో సూత్ర దారులైన సయీద్‌ మహ్మద్‌ మసూద్‌ అతని భార్య చాద్‌ కౌసర్‌ మహ్మద్‌ మసూద్‌ల పేర్లు ఈ జాబితాలో కూడా వెల్లడయ్యాయి.
 

స్విట్జర్లాండ్‌ ఎఫ్‌టీఏ విడుదల చేసిన


ఈ ఏడు గురు తమ వివరాలను భారత్‌కు వెల్ల డించకూడదనుకుంటే ఫెడరల్‌ అడ్మిని స్ట్రేటివ్‌ కోర్టులో 30 రోజుల్లోగా అపీల్‌ చేసుకోవాలని గెజిట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అప్పీలు నోటీసులను ఈ నెలలో 40 పైగా గెజిట్‌లో ప్రచురించారు. అందువల్ల మరికొంత మంది ఖాతాల వివరాలు కూడా త్వరలో వెల్లడయ్యే అవకాశముంది. స్విట్జర్లాండ్‌ ఎఫ్‌టీఏ విడుదల చేసిన ఈ గెజిట్‌లో అనేక దేశాలకు చెందిన ఖాతాదారుల పేర్లు కూడా ఉన్నాయి. ఇంతకాలం దోబూచులాడిన నల్లకుబేరుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం కొందరికి ఇరకాటంగా ఉండవచ్చుగానీ జనసామాన్యానికి మాత్రం ఆనందం కలిగించే విషయమే. యశ్‌ బిర్లా పేరిట కానీ, ఆయన నియంత్రణలో గానీ ఎలాంటి వ్యక్తిగత అకౌంట్లు స్విస్‌ బ్యాంకులో లేవని యశ్‌ బిర్లా గ్రూప్‌ వివరణ ఇచ్చింది.

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు వెల్లడించిన స్విస్‌ ఖాతాల జాబితాలో


గతంలో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు వెల్లడించిన స్విస్‌ ఖాతాల జాబితాలో యశ్‌ బిర్లా పేరున్న విషయం తెలిసిందే. నల్లధనం వ్యవహారంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో స్విస్‌ బ్యాంక్‌ ఇప్పటికే 628 మంది సమాచారాన్ని సిట్‌కు సమర్పించింది. లండన్‌లోని హెచ్‌ఎస్‌బీసీలో 1195 మంది భారతీయులకు అకౌంట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం భారతీయుల అకౌంట్‌‌స మొత్తం విలువ రూ.25,420 కోట్లు ఉంటుందని అంచనా. ఇంటర్నేషనల్‌ కన్సోర్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు (ఐసీఐజే)ల దర్యాప్తులో ఈ నల్లధనం వెలుగులోకి వచ్చింది.
నల్లధనాన్ని బయ టికి తేవాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రిమినల్స్, బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అవినీతి సొమ్మును స్విస్‌ బ్యాంకుల్లో దాచి ఉంటారని తనిఖీలు నిర్వహించినట్టు ఐసీఐజే జర్నలిస్టు ఒకరు గతంలో తెలిపారు.

బ్యాంక్‌ ఖాతాలు నిర్వహిస్తున్నారు


నల్ల కుబేరుల జాబితా మొత్తం బయట పెట్టాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో దేశమంతా ఒక దశలో ఆ అంశంపైనే చర్చ జరిగింది. పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలు విదేశీ బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై గడచిన రెండున్నర దశాబ్దాలుగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశం నలుమూలలా హోటల్‌ సామ్రాజం విస్తరించుకున్న ఒక వ్యక్తికి విదేశాల్లో 25 అకౌంట్లు వున్నాయి. ఆయా బ్యాంక్‌ ఖాతాల్లో ఆయన లక్షా 45 వేల 600 కోట్లు దాచుకున్నారు. టెలికం దిగ్గజంగా పేరుగాంచిన ఓ దక్షిణాది సీనియర్‌ రాజకీయ నేత ఒకటీ రెండు కాదు ఏకంగా 15 బ్యాంక్‌ ఖాతాలు నిర్వహిస్తున్నారు.


ఆ నేత విదేశాల్లో దాచుకున్న సొత్తు 15 వేల కోట్ల రూపాయలు. మరో వ్యక్తి దేశవ్యాప్తంగా చైన్‌లింక్‌ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఆయన విదేశాల్లో రెండు అకౌంట్లు ఆపరేట్‌ చేస్తుండగా ఆయన అకౌంట్‌లో 28 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఓ కేంద్ర మాజీ మంత్రి విదేశీ అకౌంట్లలో14 వేల 500 కోట్ల రూపాయలు ఉన్నాయట. యూత్‌ కాంగ్రెస్‌ నేతగా పలువురికి పరిచయమైన మరో కేంద్ర మాజీ మంత్రికి విదేశాల్లో ఐదు అకౌంట్లు ఉండగా అందులో 9 వేల కోట్ల రూపాయలు వున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి ఒకరికి ఉన్న రెండు విదేశీ ఖాతాలలో 29 వేల 800 కోట్ల రూపాయలు దాచుకున్నారట. మరో మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇద్దరికి 10 అకౌంట్లు ఉండగా ఆయా అకౌంట్లలో 10 వేల 500 కోట్ల రూపాయలున్నాయి.

 స్విస్‌బ్యాంకు వెల్లడించిన పేర్లలో రాజకీయ నాయకుల


ఇప్పటి వరకూ స్విస్‌బ్యాంకు వెల్లడించిన పేర్లలో రాజకీయ నాయకుల పేర్లు లేకపోవడం కొందరికి నిరాశ కలిగిస్తుండవచ్చు. అయితే ఏ రాజకీయ నాయకుడు కూడా తన పేరుతోగానీ, తనకు సంబంధించిన వారి పేరునగానీ నల్లధనం విదేశాల్లో దాచేంత తెలివితక్కువవాడు కాదు. వ్యాపార సామ్రాజ్యాల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా నల్లధనాన్ని బయటకు తరలించిన వారే ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశంలో, విదేశాల్లో నల్లధనం పోగుపడకుండా ఆగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: