హైదరాబాద్ అభివృద్ధిపై ఇటీవల టీడీపీ- టీఆర్ ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం సాగుతోంది. హైదరాబాద్ చంద్రబాబు పుట్టకముందు నుంచే మిగులు ఉన్న రాష్ట్రమని టీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత- రాక ముందు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని చంద్రబాబు మహానాడు వేదికగా సవాల్ విసిరారు. 

హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కూడా ఉంది.. 


దీనిపై కేటీఆర్ మరోసారి స్పందించారు. హైదరాబాద్ వంటి నగరాలు ఏ ఒక్కరివల్లో అభివృద్ది చెందుతాయని అనుకోరాదని వివరణ ఇచ్చారు. వందల ఏళ్ల చరిత్ర.. వందల మంది నాయకుల ముందు చూపు కారణంగానే హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకుందని చెప్పుకొచ్చారు. ఐతే.. ఈ విషయం వివరించే క్రమంలోనే కేటీఆర్ తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు గొప్పదనాన్ని కూడా పరోక్షంగా అంగీకరించారు. 

బాబు ఒక్కడి వల్లే అభివృద్ధి కాలేదు..  


హైదరాబాద్ అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు.. ఐతే.. హైదరాబాద్ కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని తాము అనలేదని.. చంద్రబాబు తన వంతు ప్రయత్నం తాను చేశాడని అన్నారు. ఆ విషయం ఒప్పుకోవాల్సిందేనని ఇందులో భేషజాలకు పోవాల్సిన పనేంలేదని కేటీఆర్ అన్నారు. 

చంద్రబాబు పాత్రను అంగీకరిస్తూనే.. ఒక్కరి వల్లే అన్నీ అయ్యాయని భావించడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఐటీలో నెంబర్ 1గా ఉన్న బెంగళూరును.. తామే నిర్మించామని ఎవరూ చెప్పుకోవడం లేదన్న సంగతిని చంద్రబాబు గుర్చించాలన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: