మహానాడులో టీడీపీ తెలంగాణ యువనాయుకుడు నన్నూరి నర్సిరెడ్డి ప్రసంగం హైలెట్ గా నిలిచింది. చూడటానికి పిల్లోడిలా కనిపించే నర్సిరెడ్డి.. మాంచి సెటైర్లతో, ప్రాసలతో, చెణుకులతో అందరినీ నవ్వించాడు. ప్రత్యేకించి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈయన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న నర్సిరెడ్డి ప్రసంగం.. 


ఈ మధ్య కేసీఆర్ చరిత్రను పాఠాల్లో పెడుతున్నారని.. పాఠాల్లో కంటే.. ప్రతి క్లాసు రూములోనూ కేసీఆర్ ఫోటో పెట్టాలని నర్సిరెడ్డి సూచించాడు. ఎందుకంటే.. పోషకాహార లోపం వచ్చిన వాళ్లు ఇలా ఉంటారని.. మద్యం అధికంగా సేవిస్తే ఇలా అవుతారని పిల్లలకు కేసీఆర్ ఫోటో చూపించి చెప్పవచ్చన్నప్పుడు వేదికపైనున్న చంద్రబాబు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. 

టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీ.. 


తెలంగాణ వస్తే  N-3 అంటే నిధులు, నీళ్లు, నియామకాలు వస్తాయని కేసీఆర్ చెప్పాడని.. కానీ తీరా వచ్చాక..K -3 అంటే కేసీఆర్, కేటీఆర్, కవితలకు మాత్రమే అవి దక్కాయని నర్సిరెడ్డి సెటైర్ వేశారు. చంద్రశేఖర్ రావ్.. రామారావ్.. హరీశ్ రావ్.. కవితారావ్.. మనకు మాత్రం ఏమీ రావ్ అంటూ నవ్వించాడు. కేసీఆర్ చెప్పిన డబల్ బెడ్రూమ్ పథకానికి లక్షా పాతికవేల కోట్లు కావాలన్నారు.  

మన మహానాడు లాగానే టీఆర్ఎస్ వాళ్లు సాగర్ లో ఓ మీటింగ్ పెట్టుకున్నారు.. అక్కడ కేసీఆర్ తాను 80 వేల పుస్తకాలు చదివానన్నాడు.. కానీ రోజుకో పుస్తకం చదివినా.. 80 వేల పుస్తకాలు చదవడానికి జీవితకాలం సరిపోదని అన్నారు. ఆ విషయం తాను ప్రచారం చేస్తే.. అరే బాబు ఆ 80 వేలు పుస్తకాలు కావురా నాయనా.. బీరు బాటిళ్లు అంటూ వివరణ ఇచ్చాడని వ్యంగ్యంగా చెప్పాడు నర్సిరెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి: