మహానాడు వేదికగా ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటు సాక్షి పత్రికనూ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ చేశారు. తాను చేపడుతున్న రాజధాని యజ్ఞానికి ప్రతిపక్షాలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నాయని తీవ్రంగా కామెంట్ చేశారు. ఐతే.. రాక్షసులు గెలిచినట్లుగా చరిత్ర లో ఎక్కడా లేదని..., రాజధాని విషయంలోనూ అదే జరుగుతుందని ధీమాగా చెప్పారు. 

దుష్ప్రచారం ఆపండి.. 


రాజధావి విషయంలో ఒక సెక్షన్ మీడియా కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని పరోక్షంగా సాక్షి గురించి ప్రస్తావించారు. భూమి పూజ ముహూర్తం పై సామాజిక మీడియాలో తప్పుడు ప్రచారం చేయటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వసనీయత లేని మీడియాలోని ఓ వర్గం కూడా దీనిపై అనవసర చర్చ చేపట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని.. ఎవరూ దీనిని పట్టించుకోనవసరం లేదని అన్నారు. 

ఏదో ఒకరకంగా దుష్ప్రచారం చేసి.. రాజధాని నిర్మాణం జాప్యం జరిగేలా చూడటమే ప్రత్యర్థి మీడియా లక్ష్యంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణంలో ఆలస్యం జరిగితే.. వచ్చే ఎన్నికల నాటికి దాన్ని టీడీపీ వైఫల్యంగా ప్రచారం చేసేందుకు కుట్ర జరుగుతోందని చంద్రబాబు విమర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పూర్తి న్యాయం చేయటం తమ బాధ్యతని,  అది నెరవేర్చి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: