ఆ మధ్య దేశం మొత్తం సంచలనం రేకెత్తించిన సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు కొత్త మలుపు తిరింది. 2002లో సల్మాన్ ప్రయాణిస్తున్న కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిమీదికి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.  ఈ కేసులో ఇటీవల స్థానిక కోర్టు సల్మాన్‌కు ఐదేండ్ల శిక్ష విధించింది. అటు తర్వాత స్థానిక కోర్టు తీర్పును హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.

హిట్ అండ్ రన్ కేసులో పోలీసుల అదుపులో సల్మాన్ ఖాన్


ఇటీవల ఆ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్టీఐ ఉద్యమ కారుడు మన్సూర్ దర్వేష్ దాఖలు చేసుకున్నాడు కానీ ఆయనకు దిమ్మతిరిగే సమాధానం వచ్చింది 2012లో మంత్రాలయలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ కేసుకు సంబంధించిన పత్రాలు కాలిపోయాయని, అందువలన అవి అందుబాటులో లేవని తెలిపారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన మన్సుర్ దర్వేష్  ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య సమాధానంపై  మండిపడుతున్నాడు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ప్రభుత్వం తిరిగి ఆ ఫైల్స్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: