సున్నితమైన సమస్యే అయినా చంద్రబాబు రాష్ట్ర విభజన గండాన్ని బాగానే గట్టెక్కారు. తెలంగాణలోనూ పార్టీని బతికించుకోగలిగారు. అంతే కాదు.. 2019 నాటికి ఏకంగా తెలంగాణలో అధికారం అందుకుంటామంటూ కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు.  ఐతే.. అది అంత సులభమైన విషయం కాదనుకోండి. 

మోత్కుపల్లికి గవర్నర్ గిరీ అందుకేనా..?


అందుకే కేసీఆర్ ను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. దళితుల విషయంలో కేసీఆర్ మొదటి నుంచీ మోసం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పటివరకూ తెలంగాణ మంత్రి వర్గంలో మాల, మాదిగ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించలేకపోయారు. 

కేసీఆర్ దగ్గర సమాధానం ఉందా.. ?


సరిగ్గా ఈ విషయాన్నే చంద్రబాబు అస్త్రంగా మలచుకుంటున్నారు. టీఆర్ఎస్ దళితులను నిలువునా మోసం చేస్తోందన్న విషయాన్ని హైలెట్ చేయబోతున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే తుంగలో తొక్కితే.. టీడీపీ మాత్రం దళితులకు అందలాలు అందిస్తుందని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మోత్కుపల్లి వంటి దళిత నేతకు గవర్నర్ పదవి కట్టబెట్టడం ద్వారా.. తెలంగాణలోని దళితులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చూశారా.. కేసీఆర్ సీఎం చేస్తానని కూడా చేయలేదు..కానీ మేం చెప్పకపోయినా దళితుడికి గవర్నర్ పదవి ఇచ్చాం.. అని చెప్పుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఒకవేళ టీడీపీ ఈ రూట్లో వెళ్తే.. టీఆర్ఎస్ ఆత్మరక్షణ ధోరణిలో పడటం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: