రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా..ఉన్నవారు ఏం పని చేసినా చాలా గొప్పగా ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 24లోని అద్దె ఇంటికి రూ.అరకోటికి పైగా కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో  ఈ అద్దె ఇంటికి రూ.81.10 లక్షలు ఖర్చు చేశారు.ఈ ఏడాది ఫిబ్రవరి 9న అద్దె ఇంటికి సీసీటీవీల ఏర్పాటు, సోలార్ పవర్ ఫెన్సింగ్ కోసం రూ.67.50 లక్షలు, కొన్ని విద్యుత్తు పనుల కోసం రూ.6 లక్షలు కలిపి మొత్తం 73.50 లక్షలు అప్పట్లో ఖర్చు చేశారు.


బాబు రెంట్ హౌజ్


జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి మొత్తం రూ.55.85 లక్షలు కేటాయిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఆదేశాలిచ్చారు.భద్రత ఏర్పాట్లు ఇలా ఎన్నో అంశాలకు లక్షలకు లక్షలు దారాపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: