నరేంద్రమోడి ఏడాది పాలనపై  కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్  తీవ్రంగా విమర్శించారు. ఏడాది పాలనపై మోదీ ప్రజలకు రాసిన లేఖలో అన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ధరలు తగ్గాయనీ మోదీ చెబుతున్నది వాస్తవం కాదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీపై ఆజాద్‌ విరుచుకుపడ్డారు. దేశంలో ధరలు తగ్గాయని మోదీ చెబుతున్నది అబద్ధమన్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్‌ రేట్లు తగ్గినా మనకు మాత్రం తగ్గలేదని తెలిపారు. 


ఉపరాష్టపతి అన్సారీతో గులాం నబీ ఆజాద్


 దేశంలో ధరలు తగ్గాయనీ మోడీ చెబుతున్నది వాస్తవం కాదన్నారు. రైల్వే ప్రయాణ ఛార్జీలు, సరుకు రవాణా ఛార్జీలు పెంచారని ఆజాద్ విమర్శించారు.మోడీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ధరలు తగ్గాయని మోడీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.   అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినా... దేశంలో మాత్రం తగ్గలేదన్నారు.నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన చెప్పారు. దేశ వృద్ధి రేటు మందగిస్తోందన్న ఆజాద్‌ ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: