గండిపేటలో తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసిన మహానాడు మూడోరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై బాబు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తీవ్ర కృషి చేస్తున్నామని తెలంగాణ ప్రజలకు తమ పార్టీ నాయకులు తాను ఎప్పుడు అండగా ఉంటామన్నారు.


మహానాడు సందర్భంగా పార్టీ లీడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


రెండు రాష్ట్రాలు నాకు  రెండు కళ్లలాంటి అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతే కాదు ఇరు రాష్ట్రాల శాంతి భద్రతలపై ఆయన మాట్లాడుతు ఈ మధ్య కాలంలో ఆడవారిపై అత్యాచారాలు, ఈవ్ టీజింగ్ లు, దాడులు ఎక్కువై పోయాయని శాంతి భద్రతలు నాగరికతకు చిహ్నమని , వాటికి విఘాతం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామని మహిళల భద్రతకు ప్రాదాన్యత ఇస్తామని తెలిపారు.

మహిళలను ఇబ్బందికి గురిచేసే పోకిరీలను విడిచిపెట్టేది లేదని, వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక శక్తుల ఆటకట్టిస్తామని , విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోవద్దని, చదువుపై దృష్టి పెట్టాలని తన ప్రసంగంలో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: