అవును.. మీరు చదివింది నిజమే.. చంద్రబాబుకు కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చారు. గతంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం.. జాతీయ స్థాయికి ఎదిగేలా కేసీఆర్ పరోక్షంగా సాయపడ్డారు. జాతీయ పార్టీగా ఎదగాలన్న ఆలోచనకు రాష్ట్రవిభజనతో ఊతం ఇచ్చారు. 

జాతీయ హోదాకు కేసీఆరే కారణమా..?


తెలుగువారు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, కేరళ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ లలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. ఐనా పార్టీ పెట్టి మూడు దశాబ్దాలు దాటినా ఎప్పుడూ టీడీపీ జాతీయ స్థాయికి వెళ్లాలన్న ప్రయత్నం చేయలేదు. అందుకు జాతీయ హోదాకు కావలసిన నిబంధనలే కారణం కావచ్చు. 

జాతీయ హోదా సాధ్యమేనా..?


ఏ పార్టీ అయినా జాతీయ హోదా సంపాదించాలంటే.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6 శాతం తెచ్చుకోవాలి. ఈ నిబంధనను సంతృప్తి పరచడం గతంలో టీడీపీకి అసాధ్యంగా అనిపించింది. ఏపీ మినహా 5 రాష్ట్రాల్లో ఆ స్కోరు తెచ్చుకోవడం కష్టం అనుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనతో టీడీపీ ప్రభావం ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరింది. 

ఏపీ, తెలంగాణ పోను.. ఇంకా నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు తెచ్చుకోవాలి. తమిళనాడు, కర్ణాటకల్లో చెప్పుకోదగిన సంఖ్యలో తెలుగువారున్నారు. అక్కడ 6శాతం ఓట్లు తెచ్చుకోవచ్చు. మరో రెండు రాష్ట్రాల్లో గట్టిగా ప్రయత్నిస్తే టీడీపీకి జాతీయ పార్టీ హోదా వచ్చేస్తుందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: