బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. గుంటూరులో జరగనున్న సమరదీక్షలో బొత్స అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్. అక్కడకాకపోతే.. విజయనగరంలో భారీ బహిరంగసభ పెట్టి అక్కడ చేరవచ్చని తెలుస్తోంది. బొత్స వైసీపీలో చేరిక కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. 

బొత్స కుర్రకారును ఆకట్టుకుంటారా..


బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన తన సామాజిక వర్గం కారణంగానే కాంగ్రెస్ లో రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించగలిగారు. ఏపీలో కాపులది పెద్ద ఓటు బ్యాంక్ అన్న సంగతి తెలిసిందే. బొత్స వైసీపీ చేరికతో ఆ ఓటు బ్యాంకు ఎటు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

యూత్ పై పవన్ పట్టు కొనసాగిస్తారా..

 
కాపుల ఓట్లను ఆకర్షించేందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కల్యాణ్ సాయం తీసుకున్నారు. అది సత్ఫలితాలనిచ్చింది. కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్న కాపులు.. సహజంగానే టీడీపీవైపు మొగ్గారు. పవన్ ఆకర్షణ దీనికి తోడై.. బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు బొత్స కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో.. కాంగ్రెస్ వ్యతిరేకత బొత్సపై ఉండకపోవచ్చు. మరి ఉత్తరాంధ్ర కాపు యూత్ ఇప్పుడు వైసీపీలో ఉన్న బొత్సవైపు మరలుతారా..ఇంకా పవన్ వైపే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

పవన్.. యుద్ధం చేస్తా.. చేస్తా.. అంటూనే ఇంకా పూర్తిగా బరిలోకి దిగడం లేదు. మరోవైపు.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. చంద్రబాబు సర్కారుపైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరి ప్రజాపోరాటాల ద్వారా బొత్స చురుకైన పాత్ర పోషిస్తే.. కాపు యూత్ ఆయన వైపు చేరినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: