ప్రతిపక్షాన్ని ఎంతగా విమర్సిస్తే.. అధికారపక్షానికి అంత ఆనందం.. ఆ అవకాశాన్ని వదులుకునేందుకు ఏ అధికార పార్టీ నాయకుడూ సిద్దంగా ఉండడు. మరి ఏకంగా పార్టీ పండుగ లాంటి మహానాడు వస్తే.. నేతలు ఊరుకుంటారా.. అందుకే మహానాడు వేదికపై వైసీపీపై నేతలంతా విమర్శలవర్షం కురిపించారు. 

జగన్ పై రావుల విమర్శలు.. 


రొటీన్ విమర్సలకు దూరంగా ఉండే రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు కూడా మహానాడు వేదికగా గళం విప్పారు. రొటీన్ గా అక్రమాలు అవినీతి అని కాకండా కాస్త వెరైటీగా విమర్శలు చేశారు. జగన్, కేసీఆర్ మంచి దోస్తులంటూ వారికి సంబంధం అంటగట్టే ప్రయత్నం చేశారు. జగన్ ను 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిగా రావుల పేర్కొన్నారు. 

జగన్.. చోర కళ డీన్ - టీడీపీ 

 
అంతేకాదు..  చోర కళ, అవినీతి వంటి కళలపై స్కూల్ పెడితే.. అందుకు జగన్ డీన్ గా వ్యవహరించవచ్చని సైటైర్ వేశారు. అలాంటి జగన్ తో ఎమ్మెల్సీ ఓట్ల కోసం టీఆర్ఎస్ దోస్తీ కట్టేందుకు ప్రయత్నిస్తోందని రావుల మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ఒకదానికి ఒకటి సహకరించుకుంటున్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ సహకారం కోసం జగన్ తో కేటీఆర్ మాట్లాడారని... జగన్ ఒప‌్పుకున్నారని వార్తలు వస్తున్నాయని.. దీన్ని బట్టి రాజకీయాలు ఎటు వెళుతున్నాయో తెలుసుకోవచ్చని రావుల విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: