తన అద్భుతమైన సంగీతంతో, పాటలతో ప్రపంచంలో సంగీత ప్రియుల్ని మంత్ర ముగ్ధులను చేసి గొప్ప సంగీత కళాకారుడు మైకేల్ జాక్స్ అంటే తెలియన వారు ఉండరు. ఈయన పాటలు అంటే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. సంగీతానికి, పాటలకు, డ్యాన్స్ కి కొత్త భాష్యం చెప్పిన గొప్ప కళాకారుడు మైకేల్ జాక్సన్. ఈయనకు సంగీతంతో పాటు రక రకాల అభిరుచులు ఉండేవి.

 మైకేల్ జాక్స్ నెవర్ ల్యాండ్ ఎస్టేట్


జాక్సన్ అమెరికాలోని సాంటా బార్బరా సమీపంలో ఓ దీవిని 1987లో రూ. వంద కోట్లకు మైఖేల్ కొన్నాడు.2700 ఎకరాల ఈ దీవిలో తన అభిరుచికి తగ్గట్టు ఆయన భారీ భవనాన్ని కట్టించుకొని నెవర్‌ల్యాండ్ అని పేరుపెట్టాడు. జూ, గార్డెన్లు, భారీ థియేటర్లు అందులో ఏర్పాటు చేయించుకున్నాడు. 2005 వరకు జాక్సన్ అందులోనే ఉన్నాడు. తాజాగా పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ అమ్మకానికి పెట్టారు,ఈ ఎస్టేట్‌లో ఆరు పడక గదుల బంగళా, 50 సీట్ల సామర్థ్యం గల సినిమా హాలు, ఓ రైల్వే స్టేషన్, పలు అతిథి గృహాలు, పలు క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి.దీని విలువ ప్రస్తుతం రూ. 640కోట్లు పలుకుతున్నదని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది.

 మైకేల్ జాక్స్ సమాధి


అంతే కాదు ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది, ఆయన ఎంతో ఇష్టంతో కట్టించుకున్న ఈ ఎస్టేట్ లో మైఖేల్ ఆత్మ తిరుగుతుందంటూ, పలువురు తక్కువ ధరకు అడుగుతున్నారట. అవన్నీ పుకార్లేనని, ఎంత చెప్పిన ఎవరూ వినడం లేదట. మరి ఈ ఎస్టేట్‌ను కొనేందు ఎవరు ముందుకు వస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: