జూన్ ఒకటో తేదీన జరగనున్న తెలంగాణ‌ ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికలకు అన్ని పార్టీలు వారివారి దీమాను వ్య‌క్త‌పరుస్తున్నాయి. టీఆర్ఎస్ 5 స్థానాలు, టీడీపీ 1 స్థానం,కాంగ్రెస్ 1 గెలుపు ఖాయమ‌ని చెప్పుకుంటున్నాయి. 6 స్థానాల‌కు గానూ 7 గురు పోటీలో ఉండ‌గా త‌ప్ప‌ని  ప‌రిస్థిత్తుల్లో ఓట్టింగ్ జ‌ర‌గాల్సి ఉంది. వారి ఎమ్మెల్యే సంఖ్యాబ‌లం ప్ర‌కారం నాలుగు స్థానాలు టీఆర్ఎస్ గెలుసుకుంటోంది అందులో సందేహం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఒకోక్క‌టి గెలిచినా మిగిలిన ఆ ఒక స్థానం పై నే అంద‌రి క‌న్ను.అధికార ప్ర‌భుత్వం మాత్రం 5 స్థానాలు గెలుపు మాదేన‌ని దీమా తో ఉంది.

టీడీపీ, కాంగ్రెస్ ఒకోక్క‌టి గెలిచినా మిగిలిన ఆ ఒక స్థానం


ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికలు  మూడు పార్టీలు బలానికి మించి నామినేషన్లు దాఖలు చేశాయి. అంగడిలో సరుకుల్లాగ శాసనసభ్యుల కొనుగోళ్ళకు పోటాపోటీగా ప్రయత్నాలు సాగుతున్నాయి. వీటిని సమర్థించుకొనేందుకు వింత వాదనలు విన్పిస్తున్నాయి. ఎవరికీ తగిన బలం లేనప్పుడు అధికార పార్టీకే హక్కువుంటుంది కదా అంటున్నారు కొందరు. ఇది రాజకీయ పునరేకీకరణ మాత్రమే అని కూడా అంటున్నారు. టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు తమకంటే తమకు సహకరించాలని కాంగ్రెస్‌, టిడిపిల వాదన. బేరసారాలు ఊపందుకున్నాయి.

తెలంగాణా లో మంచి మాస్ మసాలా సినిమా నడుపుతోంది కెసిఆర్ పార్టీ


మ‌రోవైపు.. మాక్ పోలింగ్ నిర్వహించుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎల్పీలో నిర్ణయించారు. ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు మండలి ఎన్నికల్లో ఓటు వేసే పద్ధతిని వివరించారు. అయితే ఆంద్ర ప్రాంతం లో అవి పేలవంగా ఒక యావరేజ్ సినిమా తరహాలో బోరింగ్ గా ఉంటాయి ఎందుకంటే స్థానాలకి తగ్గట్టే నామినేషన్ లు పడడం తో పెద్ద కిక్ ఉండదు. కానీ తెలంగాణా లో మంచి మాస్ మసాలా సినిమా నడుపుతోంది కెసిఆర్ పార్టీ. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడం కోసమే అధికార పక్షానికి అవకాశం ఉన్నప్పటికీ కెసిఆర్ వారు మాత్రం ఐదోది కూడా విజయం సాధిస్తాం అంటున్నారు. 

కెసిఆర్ అమితమైన ఆత్మవిశ్వాసం తో ఈ మాట చెబుతున్నారు


కెసిఆర్ అమితమైన ఆత్మవిశ్వాసం తో ఈ మాట చెబుతున్నారు. ఐదవ సీటు కూడా విజయం సాధించి తాను ఏంటో నిరూపిస్తాను అని భాహిరంగంగా ప్రకటించేశారు కెసిఆర్. " ఎలాంటి అపోహలు అనుమానాలు వద్దేవద్దు , ఐదు స్థానాలను మనమే గెలుచుకో బోతున్నాం, మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఎలా గెలుస్తాం అనేది చెప్పను,  గెలిచి తీరుతాం, మీరే చూస్తారు" అంటూ ఆయన తెలంగాణా రాష్ట్ర సమితి శాసన సభాపక్ష సమావేశం లో తన పార్టీ నేతలతో  అన్నారు. 


మరోవైపు కాంగ్రెస్‌ సమావేశంలో టిడిపికి రెండవ ప్రాధాన్యత ఓటు


ఇంకోవైపు.. కాంగ్రెస్‌ నాయకత్వం తమ శాసనసభ్యులకు క్యాంపు నిర్వహించే ప్రయత్నంలో వున్నది. స్వ‌యంగా కేంద్రం నుంచి ఆపార్టీ అగ్ర‌నాయ‌క‌లు రంగంలోకి దిగారు. నాయ‌క‌లు ఓపెన్‌ ఓటింగ్‌ పద్ధతి అమలు చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడే కోరారు. తమ సభ్యుల మీద తమకే నమ్మకం లేదు. మొత్తంమీద పార్టీల విధానాలపై చర్చ తెరమరుగైంది. పొత్తులకు ప్రాతిపదిక లేదు. శాసనసభ్యుల స్థాయిలో ఓటు సరుకుగా మారింది. మరోవైపు కాంగ్రెస్‌ సమావేశంలో టిడిపికి రెండవ ప్రాధాన్యత ఓటు వెయ్యాలన్న చర్చకూడా జరిగింది. ఆ మేరకు టిడిపి నాయకులు కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.  

కాంగ్రెస్‌ నీడ కూడా సహించలేమని


కాంగ్రెస్‌ నీడ కూడా సహించలేమని, అందుకే బిజెపికి దగ్గరయ్యామని చెప్పుకునే టిడిపి నాయకత్వానికి కాంగ్రెస్‌ను ఓట్లు అడగటంలో తప్పు కనిపించలేదు. దిగజారుతున్న విలువలకు ఇవన్నీ తార్కాణాలు. చివరకు కొందరు నాయకులు రాజకీయ వ్యభిచారం విషయంలో కూడా సీనియార్టీ చర్చలో పడిపోతున్నారు. ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారం అన్నప్పుడు ఫిరాయింపులనే వ్యతిరేకించాల్సింది పోయి ఇందులోనూ సీనియార్టీ వెతకడం అవమానకరం. సాధారణ ఎన్నికలలో పేద ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. అది ప్రజల తప్పుగా నిందించేవారూ వున్నారు. శాసనసభ్యుల స్థాయిలోనే ఓటును అమ్ముకునే దుస్థితి ఏర్పడినప్పుడు దిగజారుతున్న విలువలకు బాధ్యత పెద్దలదే తప్ప పేదలది కాదుకదా! అందుకే ప్రజాచైతన్యం మెరుగుపడాల్సిన ప్రాధాన్యత పెరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: