నోటుకు ఓటు కేసు రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఇరు రాష్ట్రాల పంచాయతీ చివరకు ఢిల్లీ వరకు చేరింది దీంతో కేంద్రం ఈ విషయాన్ని గవర్నర్ కే అప్పజెప్పాలని హోంశాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టంలో సెక్షన్: 8 క్రింద ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీస్ తదితర వ్యవస్థల మీద గవర్నర్ నరసింహన్ కి గల విశేషాధికారాలు వినియోగించుకొనేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించినట్లు మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

తెలంగాణ సీఎం కేసీఆర్


ఈ సందర్భంగా గంట సేపు గవర్నర్  తో చర్చించారు. అసలు ఇక్కడ శాంతి భద్రతలకు లోపం ఏమీ లేదని అనవసరంగా గంధరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆయనతో అన్నారు. సెక్షన్ - 8 గనక అమలులోకి తెస్తే మళ్లీ హైదరాబాద్ రణరంగంగా మారుతుందని ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని నరసింహన్ కు హితవు చెప్పినట్లు తెలుస్తుంది. కాదు కూడదూ అంటే దానిని ఆపడానికి అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేయడానికి కూడా వెనకాడనని గవర్నర్ తో కేసీఆర్ అన్నట్లు సమారాచం. 


మరింత సమాచారం తెలుసుకోండి: