భారత దేశంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఈ మద్య ప్రతి ఒక్కటీ కంప్యూటర్ పద్దతిలో నే సాగుతున్నాయి. ఆధార్,రేషన్, ఎలాంటి సర్టిఫికెట్ అయినా సరే కంప్యూటరీకరణ ద్వారా ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది. తాజాగా ఐటీఐ ఎగ్జామ్స్ కోసం హాట్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుంటే తన ఫోటో బదులు కుక్క ఫోటో వచ్చేసరికి సదరు విద్యార్థి ఖంగు తిన్నాడు. వివారాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో మిడ్నాపూర్‌కు చెందిన సౌమ్యదీప్ మహాతో (18) అనే విద్యార్ధి ఇంటర్ పాస్ అయ్యాడు ఉన్నత విద్య కోసం ఐటీఐ ప్రవేశపరీక్ష కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు.

ఆదివారం హాల్ టికెట్‌ను డౌన్ లౌడ్ చేసుకోగానే అందులో తన ఫోటోకు బదులు కుక్క ఫోటో రావడంతో ఖంగుతిన్న విద్యార్థి నోడల్ అధికారిని కలిశాడు. సాంకేతిక లోపం వల్ల జరిగిన తప్పిదం అని సర్ధిచెప్పి  మహతో ఫోటో ఉన్న కొత్త అడ్మిట్ కార్డును జారీ చేశారు.ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు నోడల్ అధికారి వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: