భారత దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గత రెండు నెలల క్రితం నెపాల్, ఖాట్మాండ్ లో భూకంపం సంభవించింది. ఇప్పటికీ ఈ భూకంపాలు అప్పుడప్పుడు వస్తున్నా సోమవారం ఉదయం మళ్లీ భూకంపం వచ్చింది ఇది రెక్టర్ స్కేల్ పై 5.2 గా నమోదైంది. మళ్లీ మధ్యాహ్నం 3.3 తీవ్రతతో కంపించింది. గతంలో వచ్చిన భూకంపంతో తొమ్మిది వేల మందిని పొట్టనపెట్టుకుంది. అప్పుడు వచ్చిన భూకంపంతో నేలమట్టమైన భవనాలు, పెద్ద పెద్ద కట్టడాలు భూస్థాపితం అయ్యాయి.

నేపాల్ లో సంభవించిన భూకంపానికి నేలమట్టమైన కట్టడాలు..


తాజాగా సంభవించిన భూకంపం ఖాట్మాండుకు 150 కిలోమీటర్ల దూరంలో వచ్చిందని భూకంప కేంద్ర అధికారులు వెల్లడించారు.  అయితే ఈ భూకంపాలు మరిన్ని సంభవించే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  భూకంప తీవ్రతను బట్టి చూస్తే.. ఆస్తినష్టం భారీగానే జరిగి వుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాణనష్టం ఎక్కువగా జరిగి వుండకూడదని ఆశిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: