చాలా రోజుల తర్వాత చంద్రబాబు, కేసీఆర్ ఒకే వేదికపై కలవబోతున్నారు. కొద్దిసేపు ఒకే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి వీరి లేటెస్టు కలయిక ఎలా ఉంటుంది.. ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసుల నేపథ్యంలో వీరు ఎలా ప్రవర్తిస్తారు.. పలకరించుకుంటారా.. ముఖం చిట్లించుకుంటారా.. అన్నది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రాష్ట్రాల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మంగళవారం విందు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. దీంతో వారిద్దరూ హాజరవబోతున్నారు. ఐతే.. ఇటీవల ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాలు రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకూ వెళ్లాయి. వైసీపీ నేతలు ప్రణబ్ ముఖర్జీని కలసి వినతిపత్రం కూడా సమర్పించారు. 

ఈసారి ఏం చేస్తారో.. ?

CHANDRABABU AND KCR కోసం చిత్ర ఫలితం
ఓవైపు టీడీపీ నేతలు గవర్నర్ పై విమర్సలు మానడం లేదు. మరోవైపు హైకోర్టు కూడా సెక్షన్ 8 పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 8అమలు చేయడం అనేది గవర్నర్ బాధ్యత అని.. కేంద్రం చెబితేనే సెక్షన్ 8 అమలుచేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో గవర్నర్ పాత్ర కీలకం కాబోతుంది. 

ఇన్ని ఆసక్తికరమైన పరిణామాల మధ్య రాష్ట్రపతి, గవర్నర్, కేసీఆర్, చంద్రబాబులు ఒకే వేదికపై కలవడం ఆసక్తికరంగా మారింది. మరి వీరు ఎలా ప్రవర్తిస్తారన్నదానిపై అందరి దృష్టి నెలకొంది. పెద్దరికంతో ప్రణబ్ ముఖర్జీ, నరసింహన్.. ఇద్దరు ముఖ్యమంత్రులకు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తారా.. లేక.. ఫార్మల్ సమావేశం కాబట్టి.. జస్ట్ ఫార్మల్ గానే వ్యవహారిస్తారా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: