తెలుగు రాష్ట్రాలో జరుగుతున్న ఓటుకు నోటు , ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతుంది. ఈ విషయం చిలికి చిలికి గాలివానలా మారిపోయింది. కేంద్రం జోక్యం చేసుకొని సర్ది చెప్పినా ఎవరి పట్టుదల వారిది అన్న చందంగా సాగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై గవర్నర్ కేంద్ర హోంశాఖను రెండు సార్లు కలిసి రావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై పవన్ కళ్యాన్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. పాలకుల వ్యవహారం పై ప్రశ్నిస్తాను అంటూ ఏకంగా ‘జనసేన’ అనే పార్టీనే స్థాపించాడు.  తెలుగు రాష్ట్రాలు అట్టుడుకి పోతున్న ఈ సమయంలో తన అభిప్రాయాన్ని త్వరలో తెల్పుతానని ట్విట్స్ చేయడంపై వైఎస్సార్ సీపీ ఆయనపై విమర్షలు గుప్పించింది.


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్


దేశం ఎటు పోతే ఏంటీ నా ఇల్లు చల్లగుండాలీ అన్నట్టుంది ఈయన వ్యవహారం అని అంటున్నారు. ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి సమయంలో వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి ట్విట్స్ పంపిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా  వైకాపా నేతలు గుడివాడ అమర్, ప్రసాద్ రెడ్డి‌లు స్పందించారు. పవన్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యల్లో ప్రజల కోసమో లేక అభిమానుల కోసమో తాపత్రయం పడుతున్నట్టు ఎక్కడా కనిపించలేదన్నారు. ట్విట్టర్ పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయని పవన్ కొత్తదారి కనిపెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: