ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కొంత ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా రేవంత్ విడుదలపై ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో అరస్టయి జైల్లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డికి బెయిల్‌ రావడంతో ఆ పార్టీ సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి


ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ శాసనసభలో టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా ఉంటాడని పాలక పక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తాడని అందుకే ఆయనపై కక్ష కట్టి ప్రభుత్వం కావాలనే స్టింగ్ ఆపరేషన్ చేసి రేవంత్ ను ఇరికించారని న్యాయం ఎప్పుడైనా తమ పక్షానే ఉంటుందని అన్నారు. అందువల్ల రేవంత్ కు క్షమాపణ చెప్పి కెసిఆర్ ఈ కేసును ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. కొందరు టీడీపీ తో లబ్ది పొంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వలస వెళుతున్నారని దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎర్రబెల్లి సవాల్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: