మోతాదుకు మించి హానికర రసాయనాలు ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా నిషేధించిన మ్యాగీ నూడిల్స్ కేసులో నెస్లే సంస్థకు కాస్త ఊరట లభించింది. భారత దేశంలో సంచలనం రేకెత్తించి అంశాంగ మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో చివరకు బాలీవుడ్ స్టార్స్ కూడా ఇరుకున్న పడాల్సి వచ్చింది. మ్యాగీ నూడుల్స్‌లో సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉండడంతో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‍‌ఎస్ఏఐ) తన పరిశోధనల్లో రుజువుకావడంతో దేశ వ్యాప్తంగా ఆ ఉత్పత్తులను జూన్ ఐదో తేది నుంచి నిషేధించింది.

నెస్లే కంపెనీ


భారత్‌లో ఇప్పటికే నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నెస్లే ఇండియా చేసిన అభ్యర్ధనకు హైకోర్టు అంగీకరిచింది.విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ నెస్లేకుందని న్యాయమూర్తులు కనడే, కొనబవల్ల స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: