తెలంగాణ టీటీడీపీ నేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులు అరెస్ట్ అయి గత కొన్ని రోజులుగా జైళ్లోనే గడిపారు.   హైకోర్టు రేవంత్ కు మంగళవారం కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కానీ ఆ కాపీ రడీ కావడం లేటు అయింది. అందులో వ్యక్తిగత పూచికత్తు ఏసీబీకి ఇవ్వాల్సి ఉంది కానీ ఇక్కడే  కాస్త ఇబ్బంది ఏర్పడింది.. ఎందుకంటే ఏసీబీ కోర్టు దానిని తీసుకోవడానికి నిరాకరించింది. అయితే తీర్పులో టైపింగ్ ఏదైనా సమస్య ఉండ వచ్చు అని రేవంత్ లాయర్లు అభిప్రాయ పడుతున్నారు.

తెలంగాణ ఏసీబీ

రేవంత్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు ఏసీబీ

దీనిపై రేపు జడ్జి వివరణ తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మొత్తానికి అందరూ ఆశించినట్లు రేవంత్ ఈ రోజు విడుదల కాకపోవడంతో కొంత నిరుత్సాహం చెందారు. ఇక బుధవారం నాడే ఆయన విడుదల అవుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: