తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పేరును ప్రస్తావించకుండా, ఆమె గురించి రాసిన కథనంపై సర్వత్రా ఆగ్రహానికి గురి చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి, మహిళా ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌పై అసభ్య కథనం ప్రచురించిన ఆంగ్ల పత్రిక 'అవుట్‌లుక్‌'పై క్రిమినల్‌ కేసు నమోదుచేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం డీజీపీని ఆదేశించారు.  స్మితను కించపరిచేలా కథనాన్ని, చిత్రాన్ని ప్రచురించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.  ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్‌పై ఔట్‌లుక్ మ్యాగజైన్‌లో వచ్చిన కార్టూన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తహసీల్దార్ల సంఘం రాష్ట్రనేత చంద్రకళ అన్నారు.


పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న స్మితా సబర్వాల్


‘డీప్ థ్రోట్' పేరుతో కావాలని తప్పుగా రాసిన కాలమ్‌లో పేర్కొన్న విషయాలు తన క్లయింట్‌కు తీవ్ర మనోవేదన కలిగించాయని స్మితా సబర్వాల్ న్యాయవాది బీ రచనారెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.మంచిగా పనిచేసే ఉద్యోగుల నైతికతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్, ప్రెస్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఔట్‌లుక్ మ్యాగజైన్ యాజమాన్యం, రిపోర్టర్‌పై కేసు నమోదు చేయాలని మరికొందరు మహిళా అధికారులు సీఎస్ రాజీవ్ శర్మకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: