తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు వ్యవహారం జైలుకు వెళ్లిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంగళవారం షరతులతో కూడిన బెయిల్ లభించింది వాస్తవానికి నిన్న సాయంత్రం విడుదల కావాల్సి ఉన్నా బెయిల్ పత్రాల్లో సాంకేతిక లోపం వల్ల అది ఈరోజుకి వాయిదా పడింది. బెయిల్‌ ఆర్డర్‌ కాపీ మాడిఫై కోసం రేవంత్‌ న్యాయవాదులు ఫర్‌బీయింగ్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో హైకోర్టు కొత్త ఆర్డర్‌ జారీ చేసింది. ష్యూరిటీలు, డిపాజిట్లు, బెయిల్‌ ఆర్డర్‌లను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో రేవంత్‌ తరపు లాయర్లు కోరారు. దీంతో రేవంత్‌రెడ్డి బెయిల్‌ ఆర్డర్‌లో సాంకేతిక పొరపాటును హైకోర్టు సరిదిద్ది కొత్త ఆర్డర్‌ను విడుదల చేసింది.

పోలీస్ కస్టడిలో ఉన్న రేవంత్ రెడ్డి


ఎట్టకేలకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయింది. చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదలయ్యేందుకు బుధవారం సాయంత్రం వరకు వేచివుండాల్సిందే. మరోవైపు  టీడీపీ అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్ని ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటే ఈ 'ఆట మొదలైంది' అనే రాసిన ఫ్లెక్సీ. ఎన్టీఆర్, చంద్రబాబుల చిత్రాలతో పాటు ఓ పెద్దపులి బొమ్మ, రేవంత్ చిత్రం ఉన్న ఈఫ్లెక్సీపై 'ఆట మొదలైంది' అని రాశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: