ఈ మద్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మంది సెలబ్రెటీల పోలీసులకు దొరికి పోతున్నారు. వీక్ ఎండ్ పార్టీల్లో చిత్తుగా తాగడం రోడ్డుపై డ్రైవ్ చేస్తూ ఆస్తి నష్టం , ప్రాణ నష్టం కలిగిస్తున్నారని ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం మొదలు పెట్టింది.  ఈ కేసుల్లో ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తల పిల్లలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు, డాక్టర్లు, లాయర్లు సైతం అడ్డంగా బుక్ అయిపోతున్నారు.


ఒక లైలా కోసం ఆడియో ఫంక్షన్లో నాగచైతన్యతో దీక్షా పంత్


తాజాగా  పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పట్టుబడకుండా బయటపడింది మోడల్ కం హీరోయిన్ దీక్షా పంత్. ఇటీవల డ్రంక్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు అందరినీ చెక్ చేస్తుండగా ఈ అమ్మడు అదే రూట్ లో వస్తుందట షరా మామూలుగా దీక్షాపంత్ ను కూడా బ్రీత్ టెస్ట్ చేయించారట అదృష్టం కొద్ది ఈ అమ్మడికి  బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో నెగెటివ్ అని రావడంతో వదిలేశారట. తెలుగు లో ఈ అమ్మడు నటించిన సినిమాలు గోపాల గోపాల, ఒక లైలా కోసం సినిమాలతో పాటు కొన్ని అప్ కమింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: