ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు క్రమంగా సద్దుమణుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే ప్రచారంలోకి వచ్చిన సెక్షన్ 8, హైదరాబాద్ అంశాలపై మాత్రం వేడి కొనసాగుతూనే ఉంది. సెక్షన్ 8 అమలు డిమాండ్ తో ఆగని టీడీపీ నాయకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కేసీఆర్  తాత జాగీరా అని ప్రశ్నిస్తున్నారు. 

ఈ హైదరాబాద్ అంశంపై టీఆర్ ఎస్ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇప్పుడు ఓ తెలంగాణ మంత్రి ఏకంగా ఔను.. హైదరాబాద్ మా తాత జాగీరే అయితే.. ఏంటట అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేస్తోంది. ఇప్పటికే సెక్షన్ 8 అంశంపై కోర్టు తీర్పులతో విషయం ఓ కొలిక్కి వస్తోంది. సెక్షన్ 8 కేవలం గవర్నర్ విచక్షణ పై ఆధారపడి ఉంటుందని కోర్టు సంకేతాలు ఇచ్చాయి. 

హైదరాబాద్ పై తెలంగాణ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు 

 minister mahender reddy కోసం చిత్ర ఫలితం
ఈ నేపథ్యంలో ఔను హైదరాబాద్ మా తాత జాగీరేనని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. మహేందర్ రెడ్డి అంతటితో ఆగకుండా  ఏపీ మంత్రులు మాట్లాడేటప్పుడు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కామెంట్ చేశారు. హైదరాబాద్ కేసీఆర్ తాతలు, తండ్రుల జాగీరే.. తెలంగాణలో ఉన్న అందరి తాతల, తండ్రుల జాగీరేనని.. మహేందర్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. 

ఓటుకు నోటు కేసును తప్పుదారి పట్టించేందుకు సెక్షన్-8 పేరిట తెలుగుదేశం నాయుకులు అలజడి సృష్టిస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాదుతో పాటు తెలంగాణలో ఎక్కడ ఏ ప్రాంతం వారున్నా అందరినీ సమానంగా, గౌరవంగా చూస్తున్నామని తెలంగాణ మంత్రి చెప్పుకొచ్చారు. ఏపీ మంత్రులు తమ రాష్ట్రం గురించి మాట్లాడటం ఆపి.. సొంతం రాష్ట్రం గురించి ఆలోచించాలని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: