ఈ మద్య భారత దేశంలో మహిళల పట్ల అన్యాయాలు, అత్యాచారాలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే అత్యాచారానికి గురైన మహిళ కాని, యువతి కాని వారి బంధువులు నింధితులతో రాజీ యత్నం చేయిస్తూ.. నష్టపరిహారం చెల్లించడం,  అవసరమైతే వారితోనే వివాహాలు జరిపించడం జరిగింది. తాజాగా అత్యాచార కేసుల్లో నిందితులకు, బాధితులకు మధ్య ఎలా రాజీ చేస్తారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బుధవారం సుప్రీం కోర్టులో రేప్ కేసులలో రాజీ విషయంపై విచారణ జరిగింది. ఈ సందర్బంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలనమైన వ్యాఖ్యలు చేసింది.

Supreme Court says rapist,victim mediation illegal

అత్యాచారం చేయడం అనేది అవతల మనిషిని బలవంత పెట్టి వారి అయిష్టంతో చేసే పని అని దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలే తప్ప రాజీ యత్నాలు చేయరాదని ధర్మాసనం పేర్కొంది. ఇలా చేస్తే మహిళలను కించ పరిచినట్లు అవుతుంది, వారి గౌరవానికి భంగం కలుగుతుందని, వారి హక్కులను హరించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇటీవల తమిళనాడులోని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి దేవదాస్ అత్యాచారం కేసులో రాజీ చేసుకోవాలని ఆదేశించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది.

అంతే కాదు నిందితుడికి బెయిల్ మంజూరు చేసి నిందితుడిని వివాహం చేసుకోవాలని న్యాయమూర్తి బాధితురాలికి సూచించడం వివాదానికి దారి తీసింది. ఇలా అయిత మగాళ్లు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారని వారి ఆగడాలకు అడ్డూ అదుపు ఉండదని వారిపట్ల మెత వైఖరి ప్రదర్శించకూడదని సూప్రీంకోర్టు సూచించింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: