జ‌రుగుతున్నప‌రిణామాల‌ను చూస్తుంటే ఓటుకు నోటు వ్య‌వ‌హారం కాస్తా కంచికి పోయేట్ట‌టు ఉన్న‌ది. రాజ‌కీయాల‌లో  ఏంచేసినా సాధ్య‌మే అన్న వాస్త‌వం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంతో మ‌రోసారి నిరూపిత‌మైంది. టీడీపీ కొనుగోలు చేసిన ప‌ద్ద‌తి రాజ‌కీయ విలువ‌ల‌కు మాయని మ‌చ్చ‌. ఈ కొనుగోలు వ్య‌వ‌హారం టీడీపీ పార్టీ లోనే లేదు. అన్నిపార్టీల‌లో జ‌రుగుతున్న తంతే కానీ టీఆర్ఎస్ పార్టీ ఆడిన చంద‌రంగంలో రేవంత్ అనే సిపాయి బ‌లయ్యారు. ఇక  తెలంగాణ‌లో టీడీపీ ని  రాజ‌కీయంగా భు స్థాపితం చేయాల‌ని  టీఆర్ఎస్ వ్యుహం బాగానే పని చేసిన‌ట్టుగా నే ప‌ని చేసి అది  మ‌ద్యలోనే బ్రెక్ ప‌డింది. ఇలా జ‌రగ‌డం ప‌లు అనుమానాలు కూడా లేక‌పోలేదు. రాజ‌కీయాల‌లో ఇలాంటివి స‌ర్వ‌సాదార‌ణం అనే చెప్పుకోవాలి. ఇందులో అదికార టీఆర్ ఎస్ చేసి త‌ప్పేమి లేదు. చేసిన త‌ప్పుడు ప‌నికి సంజాయిషి చెప్పుకొలేక నానాయాగి చేస్తున్న టీడీపీ ది ముమ్మాటికి తప్పే అంటుంన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 

తెలంగాణ ఏసీబీ, ఏజీ ల వాద‌న‌లో బెయిల్


ఓటుకు నోటు కేసులో ఎ1 ముద్దాయి కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ ఏసీబీ, ఏజీ ల వాద‌న‌లో బెయిల్ ఇవ్వొద్ద‌న కార‌ణాల‌లో ప‌స లేద‌ని, దీనిని  బ‌ట్టి చూస్తే రేవంత్ రెడ్డి కి బెయిల్ ఇవ్వొచ్చ‌ని హైకోర్టు ద‌ర్మాస‌నం పేర్కోంటు రేవంత్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మ‌రో కీల‌క వ్య‌క్తుల‌ను విచారించాల‌ని త‌ల‌చిన ఏసీబీ చివ‌రి క్ష‌ణంలో వెన‌క్కుదగ్గింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ అడ్వకేట్ జ‌న‌రల్ బెయిల్ పై కౌంట‌ర్ పిటిష‌న్ వేస్తూ బెయిల్ ఇవ్వొద్దని ప‌లు కారణాలు తెలిపారు. ఈ కార‌ణాల‌తో రేవంత్ బెయిల్ నిరాక‌రించేంతగా లేవ‌న్న‌ది సీనియ‌ర్ అడ్వ‌కేట్ వాద‌న‌. హైకోర్టులో మాకు అన్యాయం జ‌రిగిందంటూ సుప్రీం కోర్టు కు వెళాతామ‌న్న అలోచ‌న లో ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వానికి  ప్ర‌స్తుతం హైకోర్టులో వాదించిన‌ట్టుగా సుప్రీం కోర్టులో వాదిస్తే కేసులో ఏలాంటి పురోగతి ఉండ‌ద‌ని తెలుస్తోంది.


మ‌రోవైపు చంద్రబాబు వాయిస్ నిరూపిత‌మమైన నేప‌థ్యంలో ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చే విష‌యంలో కూడా జాప్యం జ‌రింగింది వాస్త‌వం కాదా? అన్న ప్ర‌శ్న కొత్త‌గా ఉత్ప‌న్నమౌతొంది. ఈ కేసులో ఎమ్మెల్యే సండ్ర ను, మ‌త్త‌య్య విచారిస్తే చాలా విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని ఉహించిన ఏసీబీ వారిని విచారించక మునుపే రేవంత్ కు బెయిల్ రావ‌డంతో సాక్షాలు తారుమారు కావ్వోచ్చ‌న్న సందేహం లెక‌పోలేదు. వాస్తావానికి చంద్ర‌బాబుకు కేంద్రంలోని ప‌ట్టు, ఏపీ లోని అధికార బ‌లంతో ఖ‌చ్చితంగా ఈ కేసునుంచి త‌ప్పించుకొవ‌డం పెద్ద విష‌య‌మేమి కాదు. అందుకే కాబోలు చంద్ర‌బాబు త‌నయుడు లోకేష్ తెలంగాణ ప్ర‌భుత్వం నోటీసులు ఇవ్వాల‌నే కొరుకుంటున్నాం, నోటీసులు ఇచ్చిన త‌ర్వాత చెబుతాం అంటూ పత్రికా ముఖంగా ప్ర‌క‌ట‌న చేశారు.

రేవంత్ రెడ్డి బెయిల్ రావ‌టంతో సంబరాలు 


ఇక తెలంగాణ టీడీపీ నాయకులు రేవంత్ రెడ్డి బెయిల్ రావ‌టంతో సంబరాలు జ‌రుపుకుంటున్నారు. బెయిల్ రావ‌డంతో నైతికంగా టీఆర్ఎస్ పై గెలిచామ‌ని వేడుక‌లు చేసుకుంటున్నారు. రోడ్ల పై ప్లెక్సిలు, స్వీట్ల్ పంచుకొవ‌డం, టైగ‌ర్ ఈజ్ బ్యాక్ అంటూ, మళ్లీ  మొద‌లైంది అంటూ నినాదాల‌తో సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. బెయిల్ అన్న‌ది ప్ర‌తి మ‌నిషికి రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు ఈ బెయిల్ కేవ‌లం రేవంత్ కే ప‌రిమితం కాలేదు. భార‌త‌దేశంలో ఉన్న ఎవ్వ‌రికైనా బెయిల్ వ‌ద్ద‌న్నా ఇస్తుంది ఇక్క‌డి న్యాయ‌శాఖ‌. చేసిన త‌ప్పుడు ప‌ని కి స‌రిదిద్దుకునే అలోచ‌న‌లో ఆ పార్టీ కినిపించ‌డంలేదు.  మ‌రోవైపు టీఆర్ఎస్ పై యుద్దం త‌ప్ప‌ద‌ని విమర్శ‌నాస్త్రాలు వేస్తున్నారు. మ‌రోవైపు రేవంత్ రెడ్డి స‌తీమ‌ణి బెయిల్ నేప‌థ్యంలో ఓ మీడియా కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..త‌న భ‌ర్త ఎప్ప‌టిలాగే రాజ‌కీయాల‌లో దూసుకు పోతార‌ని తెలిపారు. మాకు  రాజ‌కీయంగా నే కాదు  వ్య‌క్తిగ‌తంగా కూడా శ‌త్రువులు ఉన్నార‌ని ఆరోపించింది. రేవంత్  రాజ‌కీయం చేయోద్ద‌ని ఎవ్వ‌రు అన‌రు కానీ డబ్బుల‌తో రాజ్యాల‌ను కొనుగోలు చేయోచ్చ‌ని చేస్తున్న రాజ‌కీయ పెద్ద‌లకు పావులుగా మారొద్ద‌ని నిపుణుల సూచ‌న‌. 

తెలంగాణ సీఎం మౌనం వ‌హించ‌డంలో


మ‌రోవైపు తెలంగాణ సీఎం మౌనం వ‌హించ‌డంలో కూడా పలు సందేహాలు లేక‌పోలేదు. కేంద్ర ప్ర‌భుత్వం చంద్ర‌బాబు నైతికంగా మ‌ద్ద‌తును ఇస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా. కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వానికి లొంగిపోయారా అన్న అనుమానాలు లేక‌పోలేదు. గ‌త కొన్ని రోజులుగా ఈ వ్య‌వ‌హారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌నుంచి గ‌మ‌నిస్తూ వ‌స్తోంది. తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఉటా ఉటిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేసి వ‌చ్చిన త‌ర్వాత తెలుగు రాష్ట్రాల‌లో రాజ‌కీయ మార్పు చూశాం. ఏసీబీలు దుకుడు త‌గ్గ‌డం, ఏజీ బెయిల్ నిరాక‌ర‌ణ‌కు స‌వ‌రించిన కార‌ణాలు, వెను వెంట‌నే రేవంత్ కు బెయిల్ రావ‌డం చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. అంతేకాక ఈ కేసులో కీలక వ్య‌క్తి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ స‌న్ పై కేసు పెట్టాల‌ని హైకోర్టు అదేశించ‌డం లాంటి పెను మార్పులు చొటుచేసుకున్నాయి.  దీనిని బ‌ట్టి  చూస్తుంటే ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో రానున్న రోజుల్లో పెను అశ‌క్తి క‌ర సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం ఖాయంగా నే క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం ఈ కేసు ను ఎట్టి ప‌రిస్థితులో వ‌దిలేది లేద‌ని తెల్చి చెబుతుంది. టీఆర్ ఎస్ నాయ‌కులు, ఎంపీలు , ఎమ్మెల్యే లు చంద్ర‌బాబు ను ఆ దేవుడు కూడా కాపాడ‌లేడని ప్రెస్ మీట్ పెట్టి మ‌రి చెబుతూ వ‌స్తున్నారు. మ‌రికోంత మంది టీఆర్ ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు మాత్రం చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకు పోతుంద‌ని చెబుతున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల్లో ఓటుకు నోటు వ్య‌వ‌హారం ఏలాంటి ప‌రిణామాల‌కు కేంద్ర బిందువు కానుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: