ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ సీఎం అనేక వేదికలపై ఏపీ ఆర్థిక దుస్థితి గురించి గంటలు గంటలు ప్రసంగించారు. 16వేల కోట్ల రూపాయల లోటు ఉందన్నారు. జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతోందన్నారు. దానికి తగ్గట్టుగానే అప్పుడప్పుడూ ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లందే పాలన నడవని పరిస్థితి ఏపీది. మరి అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలనే అంతా ఆశిస్తారు. 

కానీ చంద్రబాబు తీరు చూస్తే రాష్ట్ర అవసరాలను పక్కకుపెట్టి ఆయన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు విరివిగా విమానాల వాడకం గతంలో వివాదాస్పదమైంది. ఇప్పుడు చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమ నిర్వహణ కోసం ఓ పత్రికకు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోందన్న సాక్షి పత్రిక కథనం కలకలం సృష్టిస్తోంది. 

ఒక్క ఈవెంట్ కు 70 కోట్లా..?

Image result for sakshi on chandrababu
ఇంతకీ 70 కోట్ల ఫీజు తీసుకుని ఆ ఆంగ్ల పత్రిక ఏం చేస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుంది. ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి మీడియాలో ప్రచారం వచ్చేలా చేస్తుంది. మీడియా మేనేజ్ మెంట్ చేస్తుంది. అంతవరకూ మాత్రమే. వచ్చే పెట్టుబడిదారుల బస, హోటళ్ల ఖర్చులు.. వంటివి ప్రభుత్వమే భరిస్తుంది. మరి ఆ మాత్రం నిర్వహణకు 70 కోట్లు చాలా ఎక్కువ అని ఓ వాదన వినిపిస్తుంది. 

చంద్రబాబే మా బ్రాండ్ అంబాసిడర్.. అని గతంలో ఏపీ మంత్రులు చాలాసార్లు జబ్బలు చరుచుకున్నారు. మరి ఆయన పలుసార్లు విదేశాలు తిరిగారు.. పెట్టుబడులను ఆహ్వానించారు. మరి అలాంటిది.. ఏపీ ప్రభుత్వం ఈ ఈవెంట్ నిర్వహించుకోలేదా.. 70 కోట్లు ఖర్చు చేసి మీడియా మేనేజ్ మెంట్ మరొకరికి అప్పగించాలా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే.. వేల కోట్లలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కార్యక్రమ నిర్వహణ కోసం 70 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద ఖర్చుకాదన్న కోణంలో సర్కారు సమర్థించుకునే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: