ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక.. ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు వచ్చాయి. నేతలు కూడా ఎవరి ప్రాంతానికి అనుకూలంగా వారు మాట్లాడుతున్నారు. నాయకులను అనుసరించి జనం కూడా వారి వారి ప్రాంతాల నేతలను సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఓ  తెలంగాణ ఎమ్మెల్యేకు ఆంధ్ర ప్రాంతంలో క్రేజ్ పెరుగుతోంది. ఆయనే రేవంత్ రెడ్డి. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో కేసీఆర్ తిరుగులేని నేతగా మారారు. ఆయన్ను ఎదిరించే దమ్ము, ధైర్యం ఉన్న నేతలు కరవయ్యారు. పూర్తి మెజారిటీ, తెలంగాణ సెంటిమెంట్ వంటి కారణాలతో కేసీఆర్ పై విమర్శలు గుప్పించేందుకు నాయకులు వెనుకాడారు. జానారెడ్డి వంటి సీనియర్లు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్సించడానికి అంతగా సుముఖత వ్యక్తం చే్యలేదు. 

ఇక్కడ ఎమ్మెల్యే - అక్కడ బిగ్ హీరో 


ఈ సమయంలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మొదటి నుంచి టీఆర్ ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. యువ తత్వం, ధైర్యం, మంచి వాయిస్ ఉండటంతో కొద్దిరోజుల్లో ఆయన బలమైన టీడీపీ నేతగా పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో గట్టిగా విమర్శించడం, బహిష్కరణ వేటు వంటి చర్యలతో ఆయన హీరోయిజం మరింత పెరిగింది. టీఆర్ఎస్ అక్రమాలు చేస్తోందని, కుటుంబపాలన సాగిస్తోందని రేవంత్ తరచు విమర్సించేవారు. 

ఇక ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ హీరో అయ్యారు. ప్రత్యేకించి కేసీఆర్ అన్నా.. టీఆర్ఎస్ అన్నా మండిపడే వారి దృష్టిలో రేవంత్ రెడ్డి బిగ్ హీరోగా మారిపోయారు. ఆయన ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా.. దాన్ని వారు పెద్దగా పట్టించుకోవడంలేదు. కేసీఆర్ తెరవెనుక చేస్తున్నారు.. రేవంత్ దొరికిపోయారు.. అంతే తేడా అన్న వాదన వినిపిస్తోంది. దాదాపు నెలరోజులపాటు సాగిన రేవంత్ జైలు జీవితం, మధ్యలో ఆయన కూతురి నిశ్చితార్థం వంటి ఘటనలతో రేవంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: