ప్రియుడి వ్యామోహంలో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన యువతి కటకటాల పాలైంది. వివారాల్లోకి వెళితే.. 2009 లో బాబులాల్ అనే వ్యక్తితో సుమిత్ర అనే మహిళకు వివాహం అయ్యింది. వీరిద్దరు కొంత కాలం నుంచి ఢిల్లీలో ఉంటున్నారు. అయితే సుమిత్రకు గతంలో అర్జున్ ఇక్కా అనే వ్యక్తితో సంబంధం ఉంది తన ప్రియురాలు ఢిల్లీలో ఉందని తెలుసుకున్న అర్జున్ తను కూడా ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తు బాబులాల్ ఇంట్లోనే ఉంటున్నాడు అర్జున్. బాబులాల్ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో అర్జున్,సుమిత్ర ఇద్దరు రాసలీలల్లో మునిగి పోయేవారు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత బాబులాల్  ఒక రోజు విరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇద్దరిని గట్టిగా హెచ్చరించాడు.  


తమ బండారం బయట పడటంతో అర్జున్ ఇక్కా, సుమిత్రలు ఓ దారుణమైన పథకం పన్నారు.  అదునుచూసి వారికి అడ్డుగా ఉన్న బాబులాల్ చంపేయాలనుకున్నారు. జూన్ 19వ తేదిన రాత్రి బాబులాల్ నిద్రపోతున్న సమయంలో సుమిత్ర ప్రియుడికి సమాచారం ఇచ్చింది. తనతో తెచ్చుకున్న కత్తితో బాబులాల్ ని దారుణంగా చంపేశారు. కానీ నేరం చేసిన వాళ్లు ఎప్పటికీ తప్పించుకోలేరు కదా బాబాలాల్ హత్యకేసు ఫైల్ చేసిన పోలీసులు వీరిద్దరినీ గట్టిగా నిలదీయడంతో నిజం చెప్పి  కటకటాల పాలైయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: