తెలంగాణలో టీ టీడీపీ నేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ నామినెటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ తో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఓటుకు నోటు కేసులో ఏసీబికి అడ్డంగా బుక్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో గడిపిన రేవంత్ కి మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది కానీ అందులో కొన్ని సాంకేతిక పొరపాట్ల వల్ల ఈయన బుధవారం విడుదల అయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.


రేవంత్ రెడ్డి, స్టిఫెన సన్ 


రేవంత్ రెడ్డి పలుకు బడి ఉన్న వ్యక్తి అని ఆయన బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు తారు మారు చేసే అవకాశం ఉందని ఏసీబీ ఆరోపణ. అంతే కాదు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహల బెయిళ్లను కూడా రద్దు చేయాలని ఏసీబీ తన పిటీషన్ లో సుప్రీంకోర్టును కోరింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున రేవంత్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని కొద్దిసేపేటి క్రితం దాఖలు చేసిన తన పిటీషన్ లో ఏసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. కాగా ఉమ్మడి రాష్ట్రా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వును రద్దు చేయాలని ఏసీబీ కోర్లకు విన్నవించినట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డికి మళ్లీ కొత్త చిక్కులు రానున్నాయా అని ఆయన అభిమానులు, పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: